శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామాభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి రూరల్, జనవరి 23: అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి కె.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని ఆర్‌సీ పాళెం గ్రామానికి ఉత్తమ జాతీయ అవార్డు దక్కిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీహరి, ఆత్మ పీడి శ్రీనివాసరావు, ఏపిడీ వెంకటరావు పలువురు అధికారులతో కలసి గ్రామాన్ని సందర్శించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి తొలి అడుగు గ్రామాలతోనే ప్రారంభం కాగా దేశానికి పట్టుకొమ్మలుగా గ్రామాలు ప్రధానమని ఇలాంటి గ్రామాలు అభివృద్ధి చెందితేనే జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లుగా భావిస్తారన్నారు. గ్రామాభివృద్ధికి ప్రథమంగా ఆయా గ్రామాలలో లభించే ఆదాయ వనరులను అనే్వషించి రాబట్టడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ధికి మంజూరు చేస్తున్న వివిధ రకాల నిధులను జోడించి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారన్నారు. ప్రతి అవకాశాన్ని ఆయా గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీ సర్పంచ్ అధికారులతో సమన్వయపరచుకుని సూచనలు, సలహాలు స్వీకరించడంతో పాటు నిధుల అనే్వషణలో దృష్టి సారించినట్లైతే తప్పక అభివృద్ధి చెందుతాయన్నారు. ఇలాంటి కోవలోనే ఆర్‌సి పాళెం గ్రామం అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవడంలో సఫలీకృతం కావడంతోనే జాతీయ స్థాయి అవార్డు దక్కిందని చెప్పారు. ఇతర గ్రామ పంచాయతీలు ఈవైపుగా దృష్టిసారించి ప్రగతిపథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో అవసరమైన మరుగుదొడ్లు, తాగునీరు, సాగునీరు, గృహ వసతి డ్రైనేజీ సదుపాయం, విద్యుత్తు, విద్య, వైద్యం వంటి ప్రధాన రంగాలకు ప్రాధాన్యతనివ్వాలని అప్పుడే ఆ గ్రామాలలో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. అంతకుముందు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలైన చెత్త నుంచి సంపద, వర్మికంపోస్టు, పొడి చెత్త, తడిచెత్త, మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇంకుడు గుంతలను పరిశీలించి గ్రామ ప్రజలతో వీటిపై అడిగి తెలుసుకుని సమాధానం రాబట్టారు. ప్రతిఒక్కరు ఈ గ్రామాన్ని, సర్పంచ్‌లను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గ్రామాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భక్తవత్సలరెడ్డి, ఏరియా కో ఆర్డినేటర్ మంజుల, ఎంపీడీవో జ్యోతి, ఇన్‌చార్జ్ డిఎల్‌పివో ఆదినారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ కొండయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఎపిఐఐసి వద్ద బీజేపీ నేతల ధర్నా
నెల్లూరుటౌన్, జనవరి 23 : పరిశ్రమల స్థాపన కోసం రైతుల దగ్గర తీసుకున్న 18వేల ఎకరాల భూములను ప్రభుత్వం తిరిగి తీసుకుని రైతులకు అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మిడతల రమేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎపిఐఐసి కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా జోనల్ మేనేజర్ వెంకటేశ్వరరావుకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు, సెజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించకుండా జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశచూపి ప్రభుత్వం, ఎపి ఐ ఐసిలు 18వేల ఎకరాలు రైతుల దగ్గర తక్కువ ధరకే భూములు సేకరించారన్నారు. ఇవేకాక అనధికారికంగా కార్పొరేట్ సంస్థల ఆధీనంలో మరో రెండువేల ఎకరాలు ఉన్నాయన్నారు. సెజ్‌ల పేరుతో రైతుల దగ్గర తీసుకున్న పొలాలను ఆయా సంస్థలు ప్రభుత్వ గ్యారెంటీతో 20వేల కోట్లు రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాల పొంది, ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పడం లేదన్నారు. ఉన్న వనరులను దోచుకుతింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణపోర్టులో కూడా భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు, స్థానికులకు గానీ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఓడరేవు ఉన్న చోట్ల ఎన్నో పరిశ్రమలు రావాలని, కాని ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం భూములను తిరిగి తీసుకుని రైతులకు ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎం శ్రీనివాసులు, మారుతి కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, బాలయ్యగౌడ్, శ్యాంబాబు, ముడియాల శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.