శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు రూ.15,730 కోట్ల వ్యయంతో ప్రణాళికలు రూపొందించి పరిపాలనా అనుమతులను జీవో నెం 46తో ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక రోడ్లు, భవనాలశాఖ అతిధిగృహంలో నీటి సరఫరా శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఈ పథకం కింద మంచినీటి సరఫరాకు రూ.1640 కోట్లు వెచ్చించడం జరుగుతుందన్నారు. ప్రతి మనిషికి రోజుకి 70 లీటర్లు వంతున మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. కండలేరు నుంచి వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేటకు, సోమశిల నుంచి ఉదయగిరి, కావలి ప్రాంతాలకు మంచినీటిని తరలించే విషయమై సంబంధిత ఇరిగేషన్, నీటి సరఫరా తదితర శాఖలతో సమగ్ర సమీక్ష అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కుళాయి ద్వారా నీటి సరఫరా పథకంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్‌కాస్ సర్వే అనంతరం చర్చ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక అందిన తదుపరి ఈనెల 27వ తేదిన టెండరును పిలిచే అవకాశం ఉందన్నారు. ఈ పథకం ద్వారా ఉదయగిరి ప్రాంతవాసులకు క్లోరిన్ సమస్య తీరడంతోపాటు సముద్రతీర ప్రాంత వాసులకు ఉప్పునీటి సమస్య తొలగి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే విధంగా దోహదపడుతుందన్నారు. ట్యాంకుల ద్వారా నీటి సరఫరాను నివారించి, నీటి సరఫరాకు అయ్యే ఖర్చును పూర్తిస్థాయిలో తగ్గించుకొనే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కోవూరు, గూడూరు శాసన సభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాశం సునీల్‌కుమార్, జేసి ఎఎండి ఇంతియాజ్, గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీరు కృష్ణారెడ్డి, ఇఇలు జివి రామిరెడ్డి, కెవి నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.