శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 23: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర రాయలసీమలో ముగించుకుని మంగళవారం నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు. తొలుత సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పునబాక గ్రామానికి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌కుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు, ఇతర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న మహిళలతో జగన్ మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పూర్తిగా ఫీజు చెల్లించడంతోపాటు, పిల్లలను బడికి పంపించే కుటుంబాలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పారు. 60 ఏళ్లకే నెలకు రూ.2వేలు పింఛను ఇస్తామని చెప్పి వారికి భరోసా కల్పించారు. అనంతరం పీటీ కండ్రిగ చేరుకున్న జగన్ గ్రామంలో పాదయాత్ర అనంతరం భోజన విరామం కోసం నిలిచారు. భోజన విరామం తరువాత ఆర్లపాడు క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకోగా అక్కడ అఖిలభారత యాదవ మహాసభ ప్రతినిధులు జగన్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే టీటీడీలో స్వామివారి సన్నిధిలో గొల్లలుగా యాదవులనే కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి చెంబేడుకు చేరుకున్నారు. అక్కడ స్థానిక ప్రజలు జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఆశావర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు వివరించారు. తమ సమస్యలను ఎలాగైనా పరిష్కరించాలని కోరారు. ఇదిలా ఉండగా జడ్పీ పాఠశాల విద్యార్థులు కూడా జగన్‌ను కలిపి తమ సంఘీభావం ప్రకటించారు. తమ పాఠశాలలో కనీస వసతులు లేవని వివరించారు. అనంతరం అక్కడి నుంచి నందిమాల క్రాస్‌రోడ్డు, సీఎస్ పేట మీదుగా ఉమ్మాలపేట చేరుకుని జిల్లాలో తొలిరోజు పాదయాత్రను ముగించారు.
వినతుల వెల్లువ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో తొలిరోజు 108 సిబ్బంది, ఆశావర్కర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు, విద్యార్థులు, యాదవ మహాసభ ప్రతినిధులు జగన్‌ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. దాంతో సానుకూలంగా స్పందించిన జగన్ వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే ఆయన నడిచిన ప్రతి గ్రామంలో మహిళలు స్థానిక సమస్యలను జగన్‌కు వివరించారు.
అడుగడుగునా జగన్‌కు నీరా‘జనం’
*హారతులు పట్టిన మహిళాలోకం
పెళ్లకూరు, జనవరి 23: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంగళవారం ఉదయం జిల్లా పరిథిలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామానికి ప్రవేశించింది. ఈ సందర్భంగా వైకాపా శ్రేణులు, ప్రజలు భారీఎత్తున జగన్‌కు నీరాజనం పట్టారు. ఈ సందర్భంగా జగన్‌కు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జగన్ తన పాదయాత్రను పార్టీశ్రేణులు, నాయకులతో కలసి పునబాక గిరిజన కాలనీ నుండి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా వైకాపా రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో యువత పెద్దఎత్తున జగన్‌కు జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు. దారి పొడవునా జగన్‌కు మహిళలు హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా జగన్ పునబాక దళిత, ఎస్టీకాలనీ, అర్ధమాల క్రాస్‌రోడ్డు, చెంబేడు, సిఎన్ పేటల కూడళ్ల వద్ద ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర చెన్నపనాయుడుపేట హరిజనవాడ వద్ద ముగిసింది. అక్కడ పార్టీ నాయకులు ప్రత్యేకంగా బస ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం జగన్ ప్రజాసంకల్ప యాత్ర శిరసనంబేడు మీదుగా నాయుడుపేటకు వెళుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెళ్లకూరు ఎంపిపి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నీ తానై ముందుండి పార్టీశ్రేణులను కలుపుకొని నడిపించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపి వరప్రసాదరావు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, నాయకులు మారాబత్తిన సుధాకర్, లక్ష్మీనారాయణ, అనిల్‌కుమార్‌రెడ్డి, తిన్నాబత్తిన రవి, కేసు ప్రసాద్, నీరజమ్మ, రాజసులోచమ్మ, రూప్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.