శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు ఆసుపత్రికి రోగమొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఫిబ్రవరి 20: నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలో పేరు గొప్పగా మారిన వంద పడకల ఆసుపత్రిలో సిబ్బంది కొరత, నిధుల లేమి వంటి కీలక కారణాలు పట్టిపీడిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆసుపత్రికే రోగమొచ్చినంతటి దుస్థితి వెంటాడుతోంది. గతంలో 30 పడకల స్థాయిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను అర్ధ పుష్కరకాలం క్రితమే వంద పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ఆ తరువాత 2015 ఫిబ్రవరి 19న నూతనంగా నిర్మించిన భవనంలోకి ఆసుపత్రి సేవలను బదలాయించారు. పేరుకే భవంతి మినహాయించి సేవలు మాత్రం వంద పడకల స్థాయిలో అందుతుండటం అంతంతమాత్రంగానే. ఇప్పుడు వంద పడకల ఆసుపత్రిని జిల్లా స్థాయికి పెంచనున్నట్లు తరచూ ప్రకటనలు వినపడుతున్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని డిఎస్‌ఆర్ ఆసుపత్రి ప్రాంగణంలోనే ప్రస్తుతం వైద్య కళాశాల తరగతులు కూడా కొనసాగుతున్నాయి. ప్రతి మెడికల్ కళాశాలలో మార్గదర్శకాల ప్రకారం అంతర్భాగంగా ఆసుపత్రి కూడా నిర్వహిస్తారు. అక్కడ జూనియర్ డాక్టర్లచే వైద్యసేవలు అందేలా నియమావళి అమలులో ఉంటుంది. ఈ సంగతి అలా ఉంచితే, జిల్లాస్థాయి ఆసుపత్రి నెల్లూరులో అవసరం లేకపోవడంతో అక్కడి హాస్పిటల్‌ను ఆత్మకూరుకు తరలించేలా ప్రతిపాదనల కసరత్తు ప్రక్రియ కొనసాగుతోంది. అలా ఆత్మకూరుకు జిల్లాస్థాయి ఆసుపత్రి అంటూ ప్రకటనలు కొనసాగుతుంటే మరోవైపున నేటికీ ఆత్మకూరులో వంద పడకల స్థాయికి తగ్గట్లుగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే ఆసుపత్రి భవనం అంతా విశాలంగా ఉండటంతో పేరు బాగానే వచ్చింది. ఈక్రమంలో రోజూ ఐదారువందలకు పైగానే ఓపి నమోదవుతోంది. దానికి తగ్గట్లుగా సేవలు అందడంలోనే సందేహాలు అలుముకుంటున్నాయి. ఇప్పటికీ 30 పడకల ఆసుపత్రికి వచ్చినట్లుగానే వివిధ ఆర్థిక కేటాయింపులు ఉండటంతో రోగుల రద్దీకి తగ్గట్లుగా సదుపాయాలు సమకూరడం లేదు. ఆత్మకూరు ఆసుపత్రిలో ప్రధానంగా నర్సింగ్ సిబ్బంది సమస్య పట్టి పీడిస్తోంది. అలాగే అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. వివిధ ఔషధాలను వెలుపల నుంచి తెచ్చుకోవాలంటూ ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు. ఇక ఏఆర్‌టి (ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల చికిత్స)కు సంబంధించి స్పష్టత కరవవుతోంది. వీరి ఔషధాలను నెల్లూరు ఆసుపత్రి నుంచి తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. అలాగే సదరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించే కౌన్సిలర్ సైతం అందుబాటులో లేరు. ఆసుపత్రిలో వివిధ రక్త పరీక్షలను ప్రైవేట్ సంస్థకు చెందిన మెడాల్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఈ మెడాల్ ద్వారా నిర్వహిస్తున్న రక్తపరీక్షల ద్వారా రోగ నిర్ధారణ ఆ తరువాత చికిత్సాక్రమం రుజువర్తనలో సాగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడాల్‌లో కొలస్ట్రాల్ పరీక్షకు సంబంధించి లోపాలు ఉంటున్నాయని ఆత్మకూరు ఆసుపత్రి వైద్యులు బాహాటంగానే వాపోతున్నారు. రాష్టస్థ్రాయిలో వైద్యారోగ్య శాఖ రక్తపరీక్షలను మెడాల్‌కు అప్పగించడం, ఆ సంస్థ ప్రాంచైజీల నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతో అంతిమంగా పేదలకు తీరని శాపాలు చుట్టుముడుతున్నాయి. మెడాల్‌లో నైపుణ్యత కలిగిన ల్యాబ్ టెక్నీషియన్లు, సరైన యంత్ర సామగ్రి లేదంటూ వైద్యులు వాపోతున్నారు. ఈ విషయాన్ని బాహాటంగా చెప్పుకోలేని దుస్థితితో సతమతమవుతున్నారు. ఇదిలాఉంటే డెంటల్ విభాగం ఉన్నా అక్కడ పళ్లు పీకడానికి, శుభ్రం చేయడం వంటి కొద్ది సేవలే పరిమితం. ఈ విభాగం ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి రావాలంటూ ప్రజానీకం విన్నవించుకుంటున్నారు. అలాగే ఆసుపత్రిలో వైద్యాధికారులకు, కింది స్థాయి సిబ్బందికి సమన్వయ ధోరణి కరవవుతున్నట్లు గుసగుసలున్నాయి. అదేవిధంగా పోలీసుశాఖకు, ఆత్మకూరు ఆసుపత్రి వైద్యులకు నడుమ కూడా సత్సంబంధాలు లేవు. ఏమైనా మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సి)లు వచ్చిన సందర్భంలో పోలీసు యంత్రాంగం పాట్లు వర్ణనాతీతం. అలాగే మెడికో లీగల్ కేసుల్లో మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ తీవ్ర జాప్యం జరుగుతుంటుంది. ఇలా ఎనె్నన్నో సమస్యలు ఆత్మకూరు ఆసుపత్రిని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఏదేమైనా విశాల భవన సదుపాయం కలిగిన ఆత్మకూరు ఆసుపత్రిలో అన్నిరకాల సదుపాయాలు సమకూరితేనే పేదలకు అవసరమైన వైద్యసేవలు అందుతాయి.