శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

హోదా పేరుతో టీడీపీ, వైకాపా డ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 20: ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రంలో టీడీపీ, వైకాపాలు ఆధిపత్యం కోసం డ్రామాలు ఆడుతున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి విమర్శించారు. స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో ఆ పార్టీ నాయకులతో కలసి ఆయన విలేఖర్ల సమావేశంలో మిత్రపక్షంతోపాటు రాష్ట్రంలో అన్ని పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. విభజన హామీలను ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 85 శాతానికి పైగా నెరవేర్చారన్నారు. అయినప్పటికీ మిత్రపక్షం, వైకాపాలు కేంద్రంపై అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్లలో ఎపి అభివృద్ధి విషయంతోపాటు అన్ని పనుల్లో కేంద్ర అగ్రతాంబులంగా నిధులు కేటాయిస్తే సాయం చేయలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం బీజేపీతోనే అభివృద్ధి చెందిందని, దీనిని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. విభజనంతరం అన్నివిధాలా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం చేయూతనిచ్చినందువల్లే నేడు రాష్ట్రం ఈ స్థితిలో ఉందన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, రెండు కళ్ల సిద్ధాంతాలతో రాష్ట్రాన్ని ఏమైనా చేసుకోండని చెప్పిన కమ్యూనిస్టులకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. వీరిని ప్రజలు దూరం పెట్టినా నాలుగేళ్ల తరువాత అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రం ఏపిని అన్నివిధాలా అదుకొంటుదని ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. విభజన హామీల్లో పొందుపర్చిన కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టు కూడా మంజూరయ్యాయన్నారు. ఇందులో పోర్టు విషయంలో కొన్ని సమస్యలు ఉండడంతో వేరేచోట ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేజోన్ కూడా పరిశీలనలో ఉందన్నారు. ఇవేకాకుండా 24 గంటలు కరెంట్, కోస్టల్ కారిడార్, బెల్ పరిశ్రమ, రెండు విమానాశ్రయాలు, మరో మూడు ఎయిర్‌పోర్టులు ఆధునీకరణ చేసినట్లు వెల్లడించారు. రెండు విశ్వవిద్యాలయాలు కూడా కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే కేంద్రం సాయం చేసిందన్నారు. ఇవే కాకుండా జల రవాణాను ప్రోత్సహించేందుకు రూ.7వేల కోట్లు కేటాయించి క్షిపణి ప్రాజెక్టు కూడా ఒకటి కేటాయిందన్నారు. ఇలా విభజనలో లేని అంశాలను కూడా కేంద్రం చేసి రాష్ట్భ్రావృద్ధికి దోహదపడుతుంటే లేనిపోని విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం మొదట తెలంగాణలో ఉన్న ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలపి తమ ప్రభుత్వం జీవో చేసిందన్నారు. అది చేయకపోతే పోలవరం ఎప్పటికీ పూర్తయ్యేది కాదన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.1.75 కోట్లు కేంద్ర నిధులు ప్యాకేజి కింద ఇచ్చిందని ఇందుకు సంబంధించిన లెక్కలన్ని తమ వద్ద ఉన్నాయన్నారు. ఎవరైన చర్చకు రమ్మంటే తాము కేటాయించిన నిధుల వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాజధాని అమరాతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రూ.2500 కోట్లు రాజధానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. డిపిఆర్ లేకుండా నిధులు ఇవ్వమంటే ఎలా ఇస్తారన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు 40 శాతం సాయం ఇవ్వలేదు, అమరావతిలో అభివృద్ధి జరగలేదని అందువల్లే పూర్తిస్థాయి నిధులు కేంద్రం విడుదల చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ లెక్కలు సరిగా ఇస్తే అమరావతికి కూడా నిధులు వస్తాయన్నారు.