శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వౌళికసదుపాయాలు కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, ఫిబ్రవరి 23: జిల్లాలో ఏర్పాటు చేసిన 162్ధన్యము కొనుగోలు కేంద్రాల్లో నూరుశాతం వౌలిక సదుపాయాలు కలుగచేసి ఈనెల 26వతేదిన తనకు ఫోన్ నెంబర్లతోసహా జాబితాను అందచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబరులో ధాన్యము కొనుగోలు కేంద్రాలలో కనీస మద్దతు ధరపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్స్, గోనె సంచులు, తేమశాతం కొలిచే మీటర్లు, వెయింగ్ స్కేల్స్ అన్ని సిద్దం చేయాలన్నారు. సెంటర్లలో స్థలం తహసిల్దార్లు వెళ్లి తనిఖీలు చేయాలన్నారు. జిల్లాలో 203 రైస్‌మిల్లులు ఉండగా, 16మంది రైస్‌మిల్లర్లు రూ.8.61కోట్లు బ్యాంకు గ్యారంటీ, కడప 6 మంది రైస్‌మిల్లర్లు, రూ.7కోట్లు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చారన్నారు. గుంటూరు జిల్లా రైస్‌మిల్లర్లు రూ.30కోట్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి అంగీకారం తెలిపారన్నారు. సీ ఎం ఆర్ బకాయిలు ఉన్న 20 రైస్ మిల్లర్లు వద్ద ఎంత ధాన్యము, బియ్యం నిల్వ ఉన్నది, ఆ మిల్లుల యొక్క కరెంటు మీటరు రీడింగ్‌లు రేపు సాయంత్రానికి వివరాలను తనకు అందచేయాలన్నారు. సీ ఎం ఆర్ బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లకు ధాన్యము కొనుగోలు కేంద్రాల నుంచి ఒక్క గింజ కూడా వారికి ఇవ్వకేడదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో అనుబంధం ఉన్న రైస్‌మిల్లులను అనుసంధానం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులను ఎక్కువ సేపు ఉండనీయకుండా వెంటనే ధాన్యం తీసుకొని పంపించాలన్నారు. అమ్మిన ధాన్యానికి వారం రోజుల్లో డబ్బును బ్యాంకుల్లో జమచేయాలన్నారు. జిల్లాలో 5లక్షల ఎకరాల్లో ధాన్యం వేశారని, 15లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యము వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు తెచ్చే ధాన్యం గ్రేడ్ ఏ రకము క్వింటాల్ ఒక్కింటికి రూ.1590లు, ఒక పుట్టికి రూ.13,515లు, సాధారణ రకం 100కేజీలకు రూ.1550లు, సాధారణ రకం పుట్టికి రూ.13,175లు కనీస మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని బయట ఎక్కడా అమ్మకుండా ధాన్యము కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కనీస మద్దతు ధర పొందాలన్నారు. ఈ సమావేశంలో జేసి ఏ ఎండి ఇంతియాజ్, డీ ఆర్ డీ ఏ పీడీ లావణ్యవేణి, మార్కెటింగ్ ఏడి ఉపేంద్ర, ఇన్‌చార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి రమణ, డీ ఎం పౌర సరఫరాలు కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ జేడి చంద్రనాయక్, డీసీ ఓ సుధాభారతి, డీసీసీబీ సీ ఇ ఓ సరిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.