నెల్లూరు

రాబోయేది జగనన్న రాజ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని వైసీపీ సీఇసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరిగ మురళీ అన్నారు. జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బుధవారం నాటికి 100రోజులు పూర్తయిన సందర్భంగా స్థానిక శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైసీపీ నాయకులు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో 100 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని పార్టీ అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే వైసీపీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, రూరల్ మండల అధ్యక్షుడు మల్లు విజయకుమార్‌రెడ్డి, కోడూరు మీరారెడ్డి, బత్తిన విజయకుమార్‌రెడ్డి, చోళవరం గిరిబాబు, మగ్ధూం మొహిద్దీన్, గూడూరు రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా వైకాపా ముస్లీం మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో జగన్మోహనరెడ్డి వందరోజుల ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక దర్గాలో ముస్లీంలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వైసీపీ ఫ్లోర్‌లీడర్‌పై చైర్మన్ మండిపాటు
కావలి, ఫిబ్రవరి 28: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని శ్రీపొట్టి శ్రీరాములు సమావేశ మందిరంలో బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభసగా సాగింది. మొదట వైసీపీ ఫ్లోర్‌లీడర్ కనుమర్లపూడి నారాయణ మాట్లాడుతూ పట్టణంలో హ్యాపీ సండే పేరుతో మున్సిపాలిటీ నిధులు వృధాగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. పచ్చదనం పేరుతో అధిక ధరలకు మొక్కలు కొనుగోలు చేస్తున్నారని, మొక్కల సంరక్షణ పేరిట నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మరోవైపు ట్రంకురోడ్డుకు ఇరువైపుల ఉన్న భారీవృక్షాలను నరికివేయటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కావలి మున్సిపాలిటీని భ్రష్టుపట్టించారని అనడంతో స్పందించిన చైర్మన్ అలేఖ్య మున్సిపాలిటీ భ్రష్టుపట్టిందనడం మంచిపద్ధతి కాదని ఫ్లోర్‌లీడర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో దోమల నివారణకు మున్సిపాలిటీ నిధుల నుంచి 23లక్షలు ఖర్చుచేసినట్లు రికార్డులలో నమోదు చేశారని, కానీ ఎటువంటి ఫలితం లేదని అన్నారు. పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలుపగా కమీషనర్ స్పందిస్తూ గత నెలలోనే కోతులను పట్టుకుని ఉదయగిరి అడవులలో వదిలామని తెలిపారు. కమీషనర్ సమాధానాన్ని కౌన్సిలర్ కనుపర్తి రాజశేఖర్ విబేధించడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనవసరమైన విషయాలలో పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పాలకవర్గానికి అవసరమైన అజెండాను ఆమోదింప చేసుకుని సమావేశాన్ని మమా అనిపించారు.

యాదవుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
కావలి టౌన్, ఫిబ్రవరి 28: యాదవుల అభివృద్ధి కోసం రెండువేల కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సమాధి వెంకట కృష్ణయ్యయాదవ్ కోరారు. అఖిలమిత్ర యాదవ సమితి కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా యాదవులకు అసెంబ్లీలో, స్థానిక సంస్థలలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం టీటీడి దేవస్థానంలో అనాధి కాలంగా కొనసాగుతున్న సన్నిగొల్లను యథావిధిగా కొనసాగించాలని, అంతేకాకుండా బ్రాహ్మణులతో సమానంగా జీతాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని చెప్పారు. టీటీడీ చైర్మన్ పదవిని యాదవులకు కేటాయించాలని కోరారు.