నెల్లూరు

జయేంద్ర సరస్వతి శివైక్యంతో జిల్లాలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 28: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి శివైక్యం చెందడంతో జిల్లాలోని ఆయన భక్తుల్లో విషాదం నింపింది. పలుమార్లు జిల్లాకు జయేంద్ర సరస్వతి వచ్చి భక్తుల్ని ఆశీర్వదించేవారు. నగరంలోని మూలాపేటలో కంచి కామకోటి పీఠం నిర్వహణలో దేవాలయం ఉంది. గత ఏడాది కూడా స్వామివారు అక్కడకు వచ్చారని స్థానిక భక్తులు తెలిపారు. అలాగే జిల్లాకు వచ్చిన ప్రతిసారి జయేంద్ర సరస్వతి జొన్నవాడ కామాక్షితాయిని దర్శించుకునేవారు. దేవాలయ సమీపంలో కంచి కామకోటి పీఠానికి చెందిన ఆశ్రమం ఉంది. గతంలో దేవాలయం ఎదురుగా వెడల్పాటి సిమెంటు రోడ్డు నిర్మించి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని భావించింది. ఈ విస్తరణలో కంచి ఆశ్రమంలో కొంతభాగం తొలగించాల్సి రావడంతో అప్పటి పాలకవర్గ చైర్మన్ చీమల రమేష్‌బాబు నేతృత్వంలో ధర్మకర్తల మండలి సభ్యులు కంచికి వెళ్లి జయేంద్ర సరస్వతికి విషయం వివరించి సహాయం కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన అమ్మవారి కార్యక్రమానికి అభ్యంతరమేమిటని, ఎంతవరకు అవసరమో అంతవరకూ తొలగించుకోవచ్చని హామీనివ్వడం జరిగింది. ప్రస్తుతం అమ్మవారి ఆలయ ఎదురుగా ఎంతో విశాలమైన ప్రదేశం, రహదారి ఏర్పడి సుందరంగా కనిపించడం వెనుక జయేంద్ర సరస్వతి ప్రమేయం కూడా ఉండడం విశేషం. ఆయన శివైక్యంతో జిల్లాలోని కంచి పీఠాలను ఒకరోజు పాటు మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
-----------

చంద్రప్రభపై రంగనాథుడు
నెల్లూరు, ఫిబ్రవరి 27: శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి చంద్రప్రభ వాహన ఉత్సవం అత్యంత వేడుకగా జరిగింది. నయనానందకరంగా అలంకరించిన స్వామివారి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి పోకూరు సుబ్బారావు ఉభయకర్తగా వ్యవహరించారు. ఉదయం స్వామివారికి సింహ వాహన సేవ జరిగింది. కోటారెడ్డి వంశస్తులు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఉత్సవాలతోపాటు ఏకాంతసేవ, సాయంత్రం ఊంజల్ సేవలు స్వామివారికి జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్ధన్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు కాకరపర్తి జగన్మోహన్‌రావు, ఒమ్మిన జనార్ధన్‌రావు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గురువారం ఉదయం పల్లకి సేవ, రాత్రికి హనుమంతు సేవ నిర్వహించనున్నారు. ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తుల కాలక్షేపం కోసం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.