నెల్లూరు

మార్చి 24న గృహాల అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 28: అర్హులైన పేదలకు ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాలను మార్చి 24వ తేదీన ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా లబ్ధిదారులకు అందించి గృహప్రవేశం చేయించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బుధవారం జనార్దనరెడ్డి కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ గృహాలను మంత్రి పరిశీలించారు. పనులు పరిశీలించిన అనంతరం అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్మించిన గృహాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరన్నది ఇప్పటికీ విచారణలో తేలలేదని, జియో ట్యాగింగ్ చేస్తామంటే ఒక్కరూ ముందుకురాలేదని తెలిపారు. దాన్నిబట్టి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం 4500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. తాము గృహాలను షేర్‌వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామన్నారు. సంపన్నులు నిర్మించుకునే గృహాలకు ఏమాత్రం తీసిపోకుండా ఇంటిలోపల, బయట అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరో సంవత్సరంలో పేదలందరికీ గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం 3,4 డివిజన్లలో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద సుమారు రూ. 5కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకుతిన్న వ్యక్తి ఊరూరూ తిరుగుతూ నీతులు వల్లిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులు చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని, 2019లో వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబునాయుడిని ప్రజలు మరలా దీవిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపరాష్టప్రతి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్చి 24వ తేదీన జిల్లాకు రానున్నారని, గృహాలు పంపిణీ చేసే ప్రాంతంలో అన్ని వౌలిక వసతులు పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా రోడ్లు, సెంట్రల్ లైటింగ్, మురికి కాలువల వ్యవస్థ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

జగన్ పోరాటం ప్రత్యేక హోదా కోసమే
* ఎంపీ మేకపాటి స్పష్టం
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 28: గడిచిన నాలుగు సంవత్సరాల నుండి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తూనే ఉన్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలో కూరగాయల మార్కెట్ వద్దనున్న సాయిబాబా గుడిలో ఎంపీ మేకపాటి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మేకపాటి విలేఖర్లతో మాట్లాడుతూ రాబోవు రోజుల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. ఆయన ప్రభుత్వంలో రైతు సంక్షేమ రాజ్యం వస్తుందని, ఆ దిశగా ఇప్పటికే రాష్ట్రప్రజలు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గడచిన నాలుగు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి వత్తిడి తేకుండా ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రజలను మభ్యపెట్టడానికి డ్రామాలు మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్ర మొదలుపెట్టి బుధవారం నాటికి వందరోజులు పూర్తయిందని, ప్రజాసమస్యలపై నిరంతరం ప్రజలతో మమేకమై తిరుగుతున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని అందరం కలిసి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన ఈసందర్భంగా పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.