శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జాలర్ల వలకు చిక్కిన అరుదైన రొయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, మార్చి 18 : జాలర్ల వలలో ఆదివారం అరుదైన రొయ్య, ప్రమాదకరమైన చేప చిక్కింది. వివరాలిలా ఉన్నాయి. కోట మండలం గోవిందుపల్లిపాళెంకు చెందిన మత్స్యకారులు శనివారం రాత్రి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి ఆదివారం తెల్లవారుఝామున తిరిగి వచ్చారు. అయితే వీరి వలలో సుమారు రెండు కిలోల బరువు కలిగిన అరుదైన ఒక రొయ్యతో పాటు, ప్రమాదకరమైన చేప కూడా పడింది. ఈ చేప సహజంగా సముద్రం లోపలి భాగంలో ఉంటుందని, అప్పుడప్పుడు ఒడ్డుకు వస్తుందని, ఆ సమయంలో తన ఒంటిపై ఉన్న విషపు ముళ్లను వెదజల్లుతుందని తెలిపారు. ఆ ముళ్లు చాలా ప్రమాదకరమని జాలర్లు తెలిపారు. జాలర్ల వలలో అరుదైన రొయ్య, ప్రమాదకరమైన చేప పడిందన్న విషయాన్ని తెలుసుకొని పలువురు వాటిని వింతగా చూశారు.