శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

‘అవగాహనతో ప్రమాదాల నివారణ సాధ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, మార్చి 22: గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల 50 శాతం అగ్ని ప్రమాదాలను నివారించగలిగామని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి ఐ ధర్మారావు అన్నారు. కోటలోని అగ్నిమాపక కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని 13 అగ్నిమాపక కేంద్రాల్లో వాటర్ స్టోరేజి ట్యాంకుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సిబ్బంది కొరత ఉండటంతో ప్రస్తుతం హోమ్‌గార్డుల సేవలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట కోట అగ్నిమాపకశాఖ అధికారి పెంచలయ్య ఉన్నారు.