శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రత్యేక హోదా భిక్ష కాదు.. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా భిక్ష కాదని ఐదు కోట్ల ఆంధ్రుల హక్కని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఐక్యవేదిక ప్రతినిధులు నినదించారు. జిల్లా కేంద్రంలోని బుజబుజనెల్లూరు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రహదారిని దిగ్బంధించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్టవ్య్రాప్త పిలుపు మేరకు జిల్లాలోని వామపక్షాలు, వైకాపా, లోక్‌సత్తా, జనసేన, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఎఎపి, ఎస్‌డిపిఐ, వివిధ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధన కోసం జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టారు. సాధన సమితి ఆధ్వర్యంలో ఉదయం 9:30 గంటలకే జాతీయ రహదారికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల, పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ రాజకీయ అజెండాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, విభజన హామీలు నెరవేర్చి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలు కనె్నర్ర చేశారని, జనాగ్రహమే ఏకమై పార్టీలకతీతంగా రోడ్డెక్కిందన్నారు. విభజనతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రిక్తహస్తం చూపటంపై నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను, హోదా పొందిన రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధిని, హోదాతో ఒనగూరే ప్రయోజనాలను నేతలు వివరించారు. ప్యాకేజీ వద్దు, హోదా ముద్దు, ప్రత్యేక హోదా భిక్షకాదు- ఆంధ్రుల హక్కు వంటి ప్లకార్డులు ప్రదర్శించారు. రహదారిని దిగ్బంధించిన అనంతరం వామపక్షాల నేతలు రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. రహదారి దిగ్బంధానికి వివిధ పార్టీలశ్రేణులు, కార్యకర్తల నుండి మంచి స్పందన రావటంతో రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులు అక్కడ నుండి కదల్లేదు. దీంతో పోలీసులు నిరసన విరమించాలని పలుమార్లు సూచించారు. అయినా ఆందోళనను ఎంతకూ విరమించకపోవటంతో పోలీసులు బైఠాయించిన వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైకాపా నగర ఎమ్మెల్యే పి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ రెండు గంటలపాటు అనుమతులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా? ఉద్యమాలను పోలీసుల చేత అణచివేయిస్తారా? ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధనకు ఇచ్చే సంఘీభావం అని ప్రశ్నించారు. నేటి విపత్కర పరిస్థితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు మోదీ, చంద్రబాబునాయుడు బాధ్యులన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని అసమర్ధుడు చంద్రబాబు నాయుడని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేదని ఆరోపించారు. జెండాలు ఏవైనా ప్రత్యేక హోదానే లక్ష్యంగా పనిచేసేందుకు, అందరితో కలసి పోరాడేందుకు, అలుపెరుగని పోరాటానికి వైకాపా సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా విభజన హామీల సమితి కన్వీనర్ మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా నాయకులు దామా అంకయ్య, రామరాజు, ప్రభాకర్, శీనయ్య, మునీర్, సీపీఎం నాయకులు కఠారి అజయ్‌కుమార్, నాగేశ్వరరావు, ఎస్‌కె మస్తాన్‌బీ, బత్తల కృష్ణయ్య, అల్లాడి గోపాల్, జనసేన నాయకులు సంజయ్, లోక్‌సత్తా నాయకులు రామారావు, వైకాపా నేత పి రూప్‌కుమార్ యాదవ్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమెక్రసీ నాయకులు సిహెచ్ సాగర్, రాంబాబు, లీలామోహన్. ఎస్‌డిపిఐ నాయకులు గని తదితరులు పాల్గొన్నారు.