శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అతి విశ్వాసం అంచున వైకాపా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 22: అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి తమకు లాభిస్తుందని, సంతృప్తికర ఫలితాలు ఎన్నికల్లో పొందుతామనే అతి విశ్వాసం అంచున జిల్లా వైకాపా ఊహల్లో ఉంటోంది. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే ఆసక్తి వైకాపా నేతల్లో కనిపించడం లేదు. నిత్యం ప్రజల్లో తిరుగుతున్నట్లు కనిపిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పార్టీ కార్యక్రమాల విజయవంతంలో అదే శ్రద్ధ చూపించలేక పోతున్నారు. ఇటీవల జిల్లాలో వైకాపా వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన సమయంలో మొదటి రెండు, మూడు రోజులు పార్టీశ్రేణుల నుంచి అంత ఉత్సాహం కానరాక పాదయాత్ర కాస్త చప్పగానే సాగిందని చెప్పాలి. తర్వాత జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహించడం, తమ నియోజకవర్గానికి సంబంధం లేనందున పాల్గొనే అవసరం లేదనే భావనలో అప్పటి వరకూ ఉన్న జిల్లా నాయకత్వం యాత్ర విజయవంతం చేసేందుకు నడుం బిగించింది. అప్పట్నుంచి యాత్ర జిల్లాలో చివరి రోజు వరకూ కూడా అనూహ్య స్పందన రావడం విశేషం. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను ఇంతలా కృషి చేస్తుంటే ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు, జిల్లా నేతలుగా ఉన్న వారు సమన్వయం కరవై ఎవరికి వారు యమునాతీరే అన్న చందంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ వైఎస్ జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారంటే జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న సమైక్యత ఎంతమాత్రమో విదితమవుతోంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కడప జిల్లా తర్వాత అంతటి ఆదరణ వైకాపాకు జిల్లాలో లభించింది. మొత్తం 10 స్థానాల్లో ఏడు స్థానాలు ఆ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఇంతటి ఆదరణ లభించిన ప్రాంతంలో తమను ఆదరించిన ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యల పట్ల సకాలంలో స్పందిస్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా వారంతా నిత్యం ప్రజలతో టచ్‌లో ఉంటూ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల విషయంలో అందరూ పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై జిల్లా ప్రజల్లో ఇప్పటికీ సరైన అవగాహన లేదనేది వాస్తవం. పార్టీ కార్యక్రమాలను, ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు చేయబోయే కార్యక్రమాలను వివరించడంలో వైకాపా నేతలు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో బలమైన ఓటింగ్ కలిగిన ప్రతిపక్ష పార్టీ అధికారపార్టీ తప్పులే తమను గెలిపిస్తాయనే అతి విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటానికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని తమకు తామే గొప్పలు చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. అయితే ప్రజల్లో తమ పార్టీ విధి విధానాలు ఎంతవరకూ తీసుకెళ్లగలిగామని విశే్లషించుకునే తీరిక మాత్రం వారికి కనిపించడం లేదని వైకాపా కార్యకర్తలే పేర్కొంటున్నారు. ఎవరి ప్రాంతాలకు వారు పరిమితమై సొంతంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సమష్టిగా జిల్లాస్థాయి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న సందర్భాలు బహుస్వల్పమనే చెప్పాలి. ఇలా ఒకరిపై ఉన్న అసంతృప్తి తమకు సంతృప్తి కలిగిస్తుందనే అతి విశ్వాసం సరికాదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. వైకాపా కార్యకర్తలు సైతం పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.