శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎన్నికల నియమావళికి అనుగుణంగా పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 22: జిల్లాలోని ఎన్నికల అధికారులు ఎన్నికల నియమావళికి అనుగుణంగా పనిచేయాలని ఓటర్ల జాబితా పరిశీలకులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక గోల్డెన్‌జూబ్లీ హాల్లో ఎన్నికల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణ, తొలగింపులు, చేర్పులు తదితర అంశాల్లో ఎన్నికల అధికారుల కృషి అభినందనీయం అన్నారు. నెల్లూరు ఓట్లలో కొంత సందిగ్ధత ఉందని, వీటిని తొలగించి ఈనెల 24న తుది జాబితాను ప్రకటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో బూత్‌లెవల్ అధికారుల నుండి ఎన్నికల అధికారుల వరకూ తీసుకున్న చర్యలు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.వెంకటసుబ్బయ్య, ఆర్‌డిఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.