నెల్లూరు

అంతరిక్షంలో కోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: ఒకప్పుడు బంగాళాఖాతానికి తూర్పు వైపున చీమలు దూరని చిట్టడవిలో చిరుదీవిలో ఉన్న శ్రీహరికోట నేడు రాకెట్ ప్రయోగాలకు గుండెకాయలా మారింది. అంతరిక్ష ప్రయోగాలకు రాచబాటగా మారి అంతరిక్షంలో కోట నిర్మించుకునేందుకు మన శాస్తవ్రేత్తలు ఎదిగారు. విదేశాలకు దీటుగా భారీ ప్రయోగాలకు శ్రీహరికోట వేదికయింది. గురువారం షార్ కేంద్రం నుండి చేపట్టిన పిఎస్‌ఎల్‌వి-సి 33 ప్రయోగం విజయంతో మన దేశ నావిగేషన్ వ్యవస్థను ఇస్రో శాస్తవ్రేత్తలు జాతికి అంకితం చేశారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సిరీస్‌లో చివరి ఉపగ్రహం అయిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చడంతో భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మొదట్లో బుడిబుడి అడుగులతో సౌండింగ్ రాకెట్‌లతో మొదలుపెట్టిన మన శాస్తవ్రేత్తలు అంచలంచెలుగా ఎదిగి ఎస్‌ఎల్‌వి, ఎఎస్‌ఎల్‌వి, పిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగాలతోపాటు నేడు జిఎస్‌ఎల్‌వి వంటి భారీ రాకెట్ ప్రయోగాలకు ఎదిగారు. ఈ పిఎస్‌ఎల్‌వి విజయంతో ప్రపంచంలోనే సొంత నావిగేషన్ కలిగిన అమెరికా, రష్యా, ఐరోపా, చైనా, జపాన్ దేశాలతోపాటు మన దేశం ఆరో దేశంగా నిలిచింది. ఈ నావిగేషన్ వ్యవస్థను ఇస్రో సమకూర్చడం ఎంతో ఉపయోగం. దేశ వాహనచోదకులకు నావిగేషన్ వ్యవస్థను అందజేసేందుకు ఇస్రో తొలిసారిగా 2006లో నడుం బిగించే ప్రయత్నం చేపట్టింది. పదేళ్లపాటు ఇందుకు శాస్తవ్రేత్తలు ఎనలేని కృషి చేశారు. దీంతో తొలిసారిగా నావిగేషన్ సిరీస్‌కు సంబంధించిన 2013 జూలైలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ప్రయోగం చేపట్టి విజయవంతం చేశారు. అనంతరం 2014 ఏప్రిల్ పిఎస్‌ఎల్‌వి-సి24 ద్వారా 1బి, 2014 అక్టోబర్ పిఎస్‌ఎల్‌వి-సి26 1సి, 2015 మార్చి పిఎస్‌ఎల్‌వి-27 1డి, 2016 జనవరి పిఎస్‌ఎల్‌వి సి-31 ద్వారా 1ఇ, 2016 మార్చి పిఎస్‌ఎల్‌వి సి-32 1ఎఫ్, 2016 ఏప్రిల్ 28 పిఎస్‌ఎల్‌వి-సి33 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1జి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేపట్టడంతో జిపిఎస్ సేవలకు ఊతమిచ్చినట్లయింది. దీంతోపాటు ఇలాంటి భారీ ప్రయోగాన్ని చేపట్టేందుకు కూడా ఇస్రో తన సన్నాహం చేస్తోంది. పదేళ్లపాటు శ్రమించి ఈ నావిగేషన్ వ్యవస్థను రూపొందించడంలో మన శాస్తవ్రేత్తలు ఎనలేని కృషి చేశారు. ఒకప్పుడు అమెరికాపై ఆధారపడి ఈ సేవలను పొందుతున్నాం. ప్రస్తుతం నావిగేషన్ అందుబాటులోకి రావడంతో మన దేశం చుట్టూ 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న విదేశాలకు సైతం నావిగేషన్ సేవలను అందించవచ్చన్నారు. ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు ప్రయోగాలు చేపట్టే ఇస్రో నేడు పది ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది. దీంతో అన్ని స్వదేశీ పరిజ్ఞానంతోనే ఉపగ్రహాలను రూపొందించి అన్ని సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. మరో ఏడాదిలో మూడో రాకెట్ ప్రయోగానికి కూడా శ్రీకారం చుట్టి ఏడాదిలో 15 ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇలాంటి వరస విజయాలతో ఇస్రో దూసుకుపోవడంతో విదేశాల చూపు షార్‌పై పడింది. వచ్చే నెలలో కార్డోశాట్ ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 21 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పిఎస్‌ఎల్‌వి విజయవంతం కావడంతో షార్‌లో సంబరాలు చేసుకున్నారు.
రాకెట్ విడిపోయింది ఇలా
320 టన్నుల బరువుగల పిఎస్‌ఎల్‌వి రాకెట్ నాలుగు దశల్లో ప్రయోగం జరిగింది. మొదటి దశలో ఘన ఇందనం సహాయంతో ఆరు స్ట్రాపాన్ మోటార్లు 1.32 నిమిషాలకు రాకెట్ నుంచి విడిపోయాయి. అక్కడ నుండి తొలిదశ 1.50 నిమిషాలకు 56 కిలోమీటర్ల ఎత్తుకు చేరి రెండో దశ ప్రారంభమైంది. అక్కడ నుండి సెకనుకు 2,394 కిలోమీటర్ల వేగంతో రెండో దశ ప్రారంభమై 4.22 నిమిషాలకు 132 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. మూడో దశ ప్రారంభమై సెకనుకు 5,373 కిలోమీటర్ల వేగంతో 11.3 నిమిషాలకు 190 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. అక్కడ నుంచి నాలుగో దశ ప్రారంభమై సెకనుకు 7,723 కిలోమీటర్ల వేగంతో 19.42 నిమిషాలకు 446 ఎత్తుకు చేరిన అనంతరం సెకనుకు 9,646 కిలోమీటర్ల వేగంతో నాలుగో దశ పూర్తయింది. అక్కడ నుండి రాకెట్ వేగాన్ని పెంచి 20.19 నిమిషాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాన్ని 284 కిలోమీటర్ల ఎత్తులో భూమికి దగ్గరగా 20,657 కిలోమీటర్ల దూరంలో భూమికి ఏటవాలుగా 19 డిగ్రీల భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ రాకెట్ విజయాన్ని ప్రకటించడంతో శాస్తవ్రేత్తలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని సంబరాలు చేసుకున్నారు. ఇప్పటివరకు షార్ నుండి మొత్తం 53 ప్రయోగాలు చేపట్టగా ఎస్‌ఎల్‌విలు 4, ఎఎస్‌ఎల్‌విలు 4, జిఎస్‌ఎల్‌విలు 9, పిఎస్‌ఎల్‌విలు 35 ప్రయోగాలు చేపట్టారు. ఇందులో 9 ప్రయోగాలు మినహా మిగిలినవి విజయవంతం అయ్యాయి. పిఎస్‌ఎల్‌విలు అయితే తొలి ప్రయోగం మినహా వరుసగా 34 విజయపరంపర మోగించాయి.