నెల్లూరు

‘సాగునీటిపై ఆందోళన వద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, మార్చి 22: సాగునీటి గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా నాన్‌డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కండ్లగుంట మధుబాబు అన్నారు. మంగళవారం రాళ్లపాడు రిజర్వాయరు వద్ద నుండి కొండాపురం ఎంపిడివో కార్యాలయానికి చేరుకున్న టిడిపి నాయకులు విలేఖరులతో మాట్లాడారు. ఈసందర్భంగా మధుబాబు మాట్లాడుతూ అధికారులు సాగునీటి విడుదల విషయంలో ఒక ప్రాంతానికి వత్తాసు పలుకుతూ నాటకీయంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి కోసం రిజర్వాయర్‌లో నీటిని నిలువ ఉంచామని అందువల్ల కుడికాలువ కింద పొలాలకు సాగునీరు ఇవ్వడం లేదంటున్న అధికారులు ఎడమ కాలువ కింద పొలాలకు నీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈనెల 2వ తేదిన చేసుకున్న ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘిస్తారంటూ రిజర్వాయర్ అధికారులపై మండిపడ్డారు. ఈ విషయంపై బుధవారం నెల్లూరులో జరిగే ఐఎబి సమావేశంలో చర్చిస్తామన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు హైదరాబాదులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నీటిపారుదల శాఖా మంత్రి దేవినేనితో మాట్లాడుతున్నారని అన్నారు. ఎలాగైనా సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడేందుకు బొల్లినేనితో పాటు తాము కూడా తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఇప్పుడు సాగునీరు ఇవ్వకపోతే 5వేల ఎకరాలలో సుమారు 20 కోట్ల రూపాయల మేర రైతులు నష్టపోతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గంటా నరసింహులు, బొట్లగుంట హరిబాబు, చెరుకూరి వెంకటాద్రి, జాగర్లమూడి రామారావు, పోలినేని రమేష్, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు మక్కెన అంకయ్యచౌదరి, చిట్టాబత్తిన బాలయ్య, మండల టిడిపి యువత అధ్యక్షుడు చాగంటి కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.