శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ముఖ్యమంత్రి పట్ల జగన్ భాష అభ్యంతరకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 22: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్ల ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన తేదీని ప్రస్తావిస్తూ చంద్రబాబునాయుడిని 420గా మాట్లాడటం, గాడ్సేతో పోల్చడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తన పుట్టినరోజు నాడు రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్ష చేపడితే జగన్మోహన్‌రెడ్డి కోర్టు బోనులో నిందితుడిగా నిలబడ్డారని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి దీక్షను విమర్శించడం సిగ్గుచేటన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై దాడి చేయాలనే తరహాలో వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. జగన్ భాష ఇకనైనా మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు హుందాగా ఉండాలని, కానీ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి వాడుతున్న భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. అక్రమ సంపాదన కేసులో 420గా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని 420 అనడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ బలహీనపడుతుందనే అభద్రతా భావంలోనే జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా విమర్శలు చేసే సమయంలో సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు.
------------

చెన్నూరు ఘటన పునరావృతం కాకుండా చర్యలు
* డీఎస్పీ రాంబాబు స్పష్టం
గూడూరు టౌన్, ఏప్రిల్ 22 : గూడూరు రూరల్ మండలం చెన్నూరు గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంలాంటి ఘటనలు డివిజన్‌లో పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని గూడూరు డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆయన తెలియజేశారు. బాలికపై అత్యాచారం జరిగింది వాస్తవమేనని డిఎస్‌పి వెల్లడించారు. ఏదేమైనా ఆరేళ్ల బాలికపై ఈవిధంగా జరగడం బాధాకరమన్నారు. ఈ కేసు విషయంలో సిఐ, ఎస్సైలు కష్టపడి పని చేశారన్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. బాధితురాలు మైనర్ అయినప్పటికీ ఫోక్సా చట్టంలో కఠిన శిక్షలు తప్పవన్నారు. ఎవరైనా చిన్నపిల్లలు, మహిళలు పట్ల నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. తప్పు చేసినవారు ఎలాంటి వారైనప్పటికీ పోలీసులపై ఒత్తిడి తీసుకురావద్దని ఆయన హెచ్చరించారు. ఈ కేసు విషయంలో తామే విచారణ చేసి నిర్ధారణకు వచ్చామని, వైద్యపరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. విలేఖర్ల సమావేశంలో గూడూరు సిఐ అక్కేశ్వరరావు, రూరల్, ఒకటవ, రెండో పట్టణ ఎస్సై బాబి, శేఖర్‌బాబు, హుస్సేన్ పాల్గొన్నారు.