శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కెపిఎల్ క్రికెట్ పోటీల్లో బంగారుపేట జట్టు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి, మే 21: పట్టణంలోని తారకరామా క్రీడాప్రాంగణంలో తిరుపతి సివిఎస్ కృష్ణమూర్తి తేజ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నాలుగు రోజులు పాటు నిర్వహించిన గ్రామీణ స్థాయి క్రికెట్ లీగ్ పోటీల్లో బంగారుపేట క్రికెట్ జట్టు విన్నర్స్‌గా నిలిచారు. చివరిరోజు సోమవారం తారకరామా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక రాజా, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణయాచేంద్ర విచ్చేచి విజేతలకు ట్రోఫి, నగదు బహుమతి, సర్ట్ఫికెట్లను అందజేశారు. ఫైనల్ మ్యాచ్ బంగారుపేట వర్సస్ శ్రీహరికోట షార్ టీమ్ మధ్య పోటీ జరిగింది. షార్ టీమ్ 78 పరుగులకే ఆల్ అవుట్ కాగా, బంగారుపేట టీమ్ 143 పరుగులు తీసి 7 వికెట్లు కోల్పొయారు. 65 పరుగుల తేడాతో షార్ టీమ్‌పై బంగారుపేట టీమ్ విజయం సాధించింది. ఈ సందర్భంగా సాయికృష్ణయాచేంద్ర మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తి కలిగించాలని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రికెట్ ఆడాలని వెంకటగిరి సివిఎస్ కృష్ణమూర్తి తేజ ఛారిటిస్ వారికి అభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో క్రికెట్ పోటీల్లో ఒడిపోయిన వారు సంతోషంగా స్వీకరించాలన్నారు. చదలవాడ విద్యాసంస్థల చైర్మన్ సుచరిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ పోటీలు నిర్వహించి ఇక్కడ మంచి టీమ్‌ను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ తరపున పంపాలనేది సంస్థ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు, వైసీపీ నాయకులు నక్కా వెంకటేశ్వర్లు, డిల్లీబాబు, చిట్టెటి హరికృష్ణ, రాజేష్, సాయినాయుడు, దనియాల రాధ, టీడీపీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, డాక్టర్ కె సంజీవరాయుడు, విజయసారధి, రామారావు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

జూన్ 1నుండి ఈ-రవాణాద్వారానే
వ్యాపారాలు నిర్వహించాలి
గూడూరు, మే 21: ఇప్పటివరకు నిమ్మ వ్యాపారస్తులు స్లిప్పుల ద్వారా రవాణా నిర్వహించే వారని, ఇకపై జూన్ 1వ తేదీ నుంచి తమ శాఖ ద్వారా జారీ చేసే ఈ రవాణా పర్మిట్లద్వారా వ్యాపారాలు నిర్వహించాలని మార్కెటింగ్ డిడి శ్రీనివాసులు నిమ్మ వ్యాపారస్తులకు సూచించారు. ఈ మేరకు సోమవారం గూడూరు రెండో పట్టణంలోని బాలాజీ లెమన్ మార్కెట్‌లో నిమ్మ వ్యాపారస్తులతో ఈ- రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఇక్కడ నుంచి లారీల్లో నిమ్మకాయల లోడును దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఇకపై ఈ-రవాణాద్వారా వ్యాపారాలు నిర్వహించాలని ఆయన వ్యాపారులకు సూచించారు. ఆన్‌లైన్‌లో పర్మిట్లు పొంది వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. ఈ విధానంలో తొలుత ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని తమకు తెలియజేస్తే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దీనికి వ్యాపారస్తులు తమకు సహకరించి ఇకపై ఈ-రవాణాపై వ్యాపారాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎడి ఉపేంద్ర, నిమ్మ వ్యాపారస్తులు తలమంచి సిద్దారెడ్డి, బాలరాజు, బిల్లు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.