శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రిలయన్స్ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, మే 21: ప్రాజెక్టుల పేరుతో రైతుల నుండి కొనుగోలు చేసిన పంట భూములను తిరిగి రైతులకు పంచిపెట్టాలని కృష్ణపట్నం గ్రామానికి చెందిన కొంతమంది డిమాండ్ చేస్తూ సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సింగూరు ప్రాజెక్టు జీఓ తరహాలో కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు రిలయన్స్ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని స్థానిక మాజీ సర్పంచ్ కంచి నాగభూషణం, కరణం వెంకటసుబ్బయ్య పలువురు డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో పంట భూములను తీసుకొని ప్రాజెక్టులు నెలకొల్పకుండా బీడు భూములుగా మార్చారని దీంతో వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది నేడు ఉపాధి లేక విలవిల లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణపట్నం గ్రామస్తులకు రావల్సిన రిలయన్స్ ప్యాకేజీని కూడా సత్వరమే అందజేయాలని అందని ద్రాక్షపండులా ప్యాకేజీ మారిందని వారు వాపోయారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. పలు డిమాండ్లతో కూడిన అర్జీని తహశీల్దార్ చెన్నయ్యకు అందజేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చేవరకు పోరాటం కొనసాగిస్తామని కృష్ణపట్నం ప్రజలు ముక్తకంఠంతో తెలిపారు.