శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పురపాలక సంఘాలుగా పంచాయతీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 22: జిల్లాలో మరో తొమ్మిది పురపాలక సంఘాల ఏర్పాటుకు దస్త్రాలు సిద్ధమయ్యాయి. పట్టణీకరణతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడాతయని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి కొత్తగా మరికొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మేజర్ పంచాయతీలను గ్రేడ్ -4 మున్సిపాలిటీలుగా మార్చాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న కమిటీ జిల్లాలోని 9 మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీ హోదాకు దగ్గరగా ఉన్నట్లు భావిస్తూ నివేదిక సమర్పించారు. ఈ మేరకు మేజర్ పంచాయతీలు ఉన్న తొమ్మిది ప్రాంతాలను గ్రేడ్-4 మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అధికారులు గతేడాది పంపారు. వీటిని పరిశీలించి పూర్తి కసరత్తు చేసిన ప్రభుత్వం, త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాలెం, అల్లూరు, కోట, తడ, రాపూరు, పొదలకూరు, ముత్తుకూరు, వింజమూరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, కావలి, ఆత్మకూరు మున్సిపాలిటీలతో పాటు నెల్లూరు నగర కార్పొరేషన్ ఉంది. కొత్తగా 9 పురపాలక సంఘాలు చేరితే వీటి సంఖ్య 15కు చేరనుంది. సాధారణంగా గ్రేడ్-4 స్థాయి మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలంటే జనాభా 25వేల వరకూ ఉండాలి. అయితే బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీలో మాత్రమే 25 వేల జనాభా ఉంది. మిగిలిన పంచాయతీల్లో అంత జనాభా లేకపోవడంతో సమీపంలోని పంచాయతీలను విలీనం చేయడం ద్వారా మున్సిపాలిటీలుగా మార్చేందుకు అవకాశం ఉంటుందని భావించిన అధికారులు ఆ దిశగా ఆలోచించాలని ప్రతిపాదనల్లో సూచించారు. ఏడాది నుండి ఈ అంశంపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం చివరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వింజమూరులో జరిగిన ఓ సమావేశంలో ప్రస్తావిస్తూ త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్లు ప్రకటించారు. మరో రెండు నెలల్లో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో ఈ 9 పంచాయతీలు మున్సిపల్ ఎన్నికల బరిలో ఉండబోతున్నాయి. ఒకవేళ ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందనున్న పంచాయతీల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. ఒకేసారి మున్సిపల్ ఎన్నికలకు ఈ పంచాయతీలు సిద్ధమవుతాయి. మున్సిపాలిటీగా రూపాంతరం చెందితే నిధుల విడుదల మొదలు ఇతర అభివృద్ధి విషయాల్లో ప్రాధాన్యత ఉండనుంది. పట్టణీకరణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం కూడా నిధులు ఎక్కువగా అందిస్తుంది. కేంద్రం నుండి ఎక్కువ నిధులు రాబట్టుకోవచ్చనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈనేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ పురపాలక సంఘాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం వెలువరించబోతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారడం వల్ల వాటి రూపురేఖలు మారతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. పక్కా ఇళ్ల నిర్మాణంతో పాటు వౌలిక వసతులను మెరుగుపరుచుకునేందుకు వీలు కలగనుంది. జూన్ మొదటి వారంలో మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సిద్ధం కావడంతో ప్రభుత్వం కూడా ఈ కొత్త మున్సిపాలిటీలపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.