శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దేశంలో నిరంకుశం పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, మే 26: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ పాలన నియంత హిట్లర్‌ను తలపించేలా ఉందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య విమర్శించారు. నాలుగేళ్ల బీజేపీ పాలనలో ప్రధాని మోదీ చేసిన మోసాలు, అబద్ధాలు, అవినీతిని ఎండగట్టేందుకు ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రణ శంఖారావం నినాదాన్ని జిల్లా కేంద్రంలోని విఆర్‌సి కూడలి వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్నిర్మాణ చట్టంలోని అంశాలను అమలు చేయకుండా ద్రోహం చేశారన్నారు. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మోదీ 100 రోజుల్లో దేశ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి అవినీతిని నిర్మూలిస్తానన్న హామీ అపహాస్యం పాలయిందన్నారు. బీజేపీ పాలనలో వేలకోట్ల అవినీతి, భారీ కుంభకోణాలు జరిగితే వాటిపై విచారణ లేదన్నారు. బ్యాంక్‌లకు టోకరా వేసిన నీరవ్‌మోదీ, లలిత్‌మోడీ, విజయ్‌మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోవడానికి సహకరించారని మండిపడ్డారు. దేశంలోని దళితులు, గిరిజనులు, ముస్లిం, మైనారిటీ వర్గాలపై దాడులు, అణచివేతలు, అత్యాచారాలు పెచ్చరిల్లాయన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బాగా తగ్గినా దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటున్నాయన్నారు. ఆర్‌బిఐ, ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, ప్రసార మాధ్యమాలు వంటి సంస్థలను బెదిరిస్తూ వాటి స్వతంత్ర ప్రతిపత్తిని, విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారన్నారు. మొత్తంగా దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతూ, ఆర్‌ఎస్‌ఎస్ రాక్షసపాలన సాగుతోందని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సివి శేషారెడ్డి, చేవూరు దేవకుమార్, చెంచలబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.