శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైల్వే సబ్ వేకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 26: సూళ్లూరుపేట పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని స్థానిక కచ్చేరి వీధిలో ఉన్న రైల్వేగేటు వద్ద రైల్వే సబ్ వే కల్పనకు కృషి చేస్తానని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. శనివారం ఆయన రైల్వే అధికారులతో కలసి రైల్వే సబ్ వే ఏర్పాటుచేసే వీధిని, రైల్వేగేటును పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులు రూపొందించిన సబ్ వే మ్యాప్‌ను తీసుకొని కొలతలు సైతం వేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ సబ్ వే వల్ల ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. కొద్దిపాటి సమస్యలు తలెత్తినా ప్రజలు సబ్ వే ఏర్పాటుకు పూర్తిగా సహకరించాలన్నారు. త్వరలోనే మున్సిపాలిటీ, రైల్వే అధికారులతో పాటు అందరితో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు వైసీపీ నాయకులు వంకా రామాంజనేయులు తదితరులు ఉన్నారు.

వీఎస్‌యూ పీజి సెట్ ప్రవేశ ఫలితాలు విడుదల
వెంకటాచలం, మే 26: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పరిథిలోని అనుబంధ కళాశాల్లోని పీజి సెట్ ప్రవేశ పరిక్షల ఫలితాలను శనివారం వీఎస్‌యూ రిజిస్టార్ దుర్గా ప్రసాద్ విడుదల చేశారు. వీఎస్‌యూ పీజి సెట్ ప్రవేశ పరిక్షలు ఈనెల 24, 25వ తేదిలు నిర్వహించారు. ఈ పరిక్షల్లో అర్హత పొందిన విద్యార్ధుల యొక్క వివరాలు ఆయన వెల్లడించారు. వీఎస్‌యూ పీజి సెట్ ప్రవేశ పరిక్షల్లో భాగంగా నిర్వహించిన దామోదర ( లైఫ్ సైన్స్ ),పూర్ణిమ ( తెలుగు ), ఎ. వెంకటేష్ ప్రసాద్ ( కామర్స్ ), కిరణ్ సింగ్ ( కంప్యూటర్ సైన్స్ ), కావేరి సుకన్య ( ఫిజిక్స్ ), వెంకటేష్ ( స్టాటిస్టెక్స్ ), లింగమంశెట్టి మోష్ ( ఇంగ్లీష్ ), సాయి భార్గవి ( కెమిస్ట్రీ ) ఈపరిక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. వీఎస్‌యూ పీజి సెట్ 2018 కౌన్సిలింగ్‌ను జూన్ 10 తేది నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర పూర్తి వివరాల కోసం వీఎస్‌యూ పీజి సెట్ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో పీజి సెట్ కన్వీనర్ సుజ నాయర్, అస్టిటెంట్ రిజిస్టార్ సుజయ్‌కుమార్, పీఆర్‌వో వీరారెడ్డి తదితరులున్నారు.