శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గిరిజన మత్స్యకారులపై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగం, మే 26: గిరిజన మత్స్యకారులపై ఎటువంటి విచారణ జరుపకుండా బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై ప్రసాద్‌రెడ్డి దాడి చేశారంటూ శనివారం సంగం పోలీస్ స్టేషన్ ఎదుట మండలంలోని జంగాల కండ్రిక గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జంగాల కండ్రిక గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు కనిగిరి రిజర్వాయర్‌లో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తారు. వీరికి మత్స్యకార సొసైటీ ఉండటంతో అధికారికంగా నగదు చెల్లించి చేపలు పట్టుకుంటారు. సొసైటీ వారు నగదు చెల్లించిన వెంటనే రశీదు అందజేస్తారు. మత్స్యకార సొసైటీ కింద మొత్తం 26 గ్రామాలు ఉన్నాయి. వీరు రిజర్వాయర్‌లో చేపలు పట్టుకోవాలంటే సొసైటీకి రూ.6.80 లక్షల రుసుము చెల్లించాలి. సంగం మండలం జంగాల కండ్రిక గ్రామానికి చెందిన మత్స్యకారుల వాటా కింద రూ.90వేలు సొసైటీకి చెల్లించి రశీదులు పొందారు. సొసైటీకి చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని మత్స్యశాఖ అధికారులతో అనధికారికంగా ఒక వ్యాపారి కుమ్మక్కై మత్స్యకారులు సొసైటీకి చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని అతనే చెల్లించి మత్స్యకారులు పట్టిన చేపలను అతనే కొనుగోలు చేసి అమ్ముకుంటున్నాడు. సొసైటీకి మరో రూ.90 వేలు చెల్లించాల్సి ఉంది. మరికొన్ని గ్రామాల వారు కూడా నగదు చెల్లించాల్సి ఉంది. జంగాల కండ్రిక గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు అధికారికంగా నగదు చెల్లించి చేపలు పట్టుకుని శనివారం బుచ్చిరెడ్డిపాళెంలో విక్రయిస్తుండగా మత్స్యశాఖ అధికారులు వారు అనధికారికంగా చేపలు పడుతున్నారని బుచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో బుచ్చి ఎస్సై తమ పరిధి కాకపోయిన ఎనిమిదిమంది గిరిజన మత్స్యకారులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఎటువంటి విచారణ లేకుండా విచక్షణా రహితంగా కొట్టి సంగం పోలీస్‌లకు అప్పగించారు. దాంతో గిరిజన మత్స్యకారులు సంగం పోలీస్ స్టేషన్ ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసుల అరాచకం నశించాలని, గిరిజన మత్స్యకారులను విడిపించాలంటూ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన మత్స్యశాఖ అధికారిని గిరిజనులు నిలదీసారు. దాంతో మత్స్యశాఖ అధికారులు తమ ఫిర్యాదును వాపసు తీసుకుని స్టేషన్ నుంచి ఎనిమిది మంది గిరిజన మత్స్యకారులను విడిపించారు. గిరిజిన మత్స్యకారులపై అన్యాయంగా, అమానుషంగా దాడి చేసిన బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్సై ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా రిజర్వాయర్‌లో అనధికారికంగా చేపలు పట్టి అమ్ముతున్నారని మత్స్యశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చామని, అనధికారికంగా చేపలు పట్టడం నిషేధమని వారికి తెలిపామని అన్నారు. గిరిజన మత్స్యకారులపై దాడి చేయలేదని ఆయన చెప్పారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి
తడ, మే 26: తడ మండల కేంద్రం సమీపంలో చిత్తూరు జిల్లా అడవుల నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఒక జింక జాతీయ రహదారిని దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం చిత్తూరు జిల్లా అడవుల నుంచి వచ్చిన ఒక జింక గత పదిరోజులు నుంచి తడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఈ క్రమంలో శనివారం తడ నిప్పో పరిశ్రమ ఎదురుగా ఉన్న మామిడి తోట నుంచి వేగంగా జాతీయ రహదారిని దాటుతుండగా నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్లే మార్గంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతిచెందింది. దీంతో స్థానికులు వన్యప్రాణిశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు మృతిచెందిన జింకకు పంచనామా నిర్వహించారు.