శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మన ఊరు - మన బడి రేపటితో ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మే 3: రాష్ట్ర ప్రభుత్వం గడచిన విద్యాసంవత్సర ముగింపు అనంతరం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమం ఈనెల 5వ తేదీతో ముగియనుంది. ప్రతియేటా విద్యాసంవత్సర ప్రారంభంలోనూ, దానికి కొద్దిరోజుల ముందునుంచో ‘బడి బాట’ వంటి కార్యక్రమాలను చేపట్టడం పరిపాటి. అయితే అదే తరహా కార్యక్రమాన్ని సంస్కరించారు. విద్యాసంవత్సర కార్యక్రమానికి ముందుకు బదులు, చదువుల ఏడాది పూర్తికాగానే గత నెల 24వ తేదీ నుంచి చేపట్టారు. మన ఊరు- మన బడి ప్రకారం వచ్చే ఏడాది ఆయా జనావాసాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న సంవత్సరంలో చేరే విద్యార్థుల సంఖ్యపై గణన చేపట్టారు. అంగన్‌వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తిచేసుకుని ఎలిమెంటరీల్లో ఒకటో తరగతి అభ్యాసం కోసం చేరే వారి పేర్లను తొలుత నమోదు చేశారు. అలాగే ఇంటింటా తిరుగుతూ వచ్చే ఏడాది నుంచి బడిలో చేర్పించే వారిచే అడ్మిషన్ ఫారాలపై విద్యార్థుల తల్లిదండ్రుల సంతకాలను సేకరించారు. మండుటెండల కారణంగా ఈ కార్యక్రమం కొన్నిచోట్ల మొక్కు‘బడి’ తంతుగానే పూర్తిచేశారు. ఇదిలాఉంటే కొందరు ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యంలో భాగస్వాములుగా ఉంటూ తమ సొంత అక్రమార్జనలోనే పునీతులవుతున్నారు. మండల కేంద్రమైన అనంతసాగరంలోని రెండు ప్రైవేట్ స్కూళ్లలో ఇదే తంతు జరుగుతుండటం గమనార్హం. అలాగే ఇక్కడి ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ హాస్టళ్లలో సీట్లు లభిస్తున్న వైనంపై కూడా విమర్శలు రేగుతున్నాయి. కాగా, మన ఊరు- మన బడి కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు తిరిగి సంపాదిత సెలవుల్ని మంజూరు చేయనున్నారు. అలాగే కార్యక్రమ నిర్వహణకు గాను ప్రధానోపాధ్యాయులకు రోజుకు 400 రూపాయలు, ఉపాధ్యాయులకు 250 రూపాయల వంతున గౌరవ వేతనాలు మంజూరు కానున్నాయి. అయితే కొందరు పంతుళ్లు మాత్రం మన ఊరు- మన బడిలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని చెప్పడంలోనూ సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలంటే విద్యార్థుల ప్రవేశం పుంజుకోవాలనేది కొందరి టీచర్లలో పట్టుదల పెంచేలా చేసింది. ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పంచాయతీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రైవేట్‌కు దీటుగా తమ విద్యాబోధన ఉంటుందని ఉపాధ్యాయుల భరోసాతో పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సమ్మతించారు. గతంలో ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు హైస్కూల్ ఉపాధ్యాయ వర్గం కూడా ఇదే పంథా కొనసాగించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మేలైన విద్యాబోధన సాగితే తాము భారీగా ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లకు తమ సంతతిని ఎందుకు పంపుతామనేది పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి ఎదురవుతున్న సూటిప్రశ్న. ఇదిలాఉంటే వచ్చే విద్యాసంవత్సరంలో చేరే విద్యార్థుల సంఖ్యను సుమారుగా పరిగణనలోకి తీసుకుంటూ ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి ఆ తరువాత బదిలీల ప్రక్రియ నిర్వహించాలనేది ప్రభుత్వ యోచనగా ఉండటం గమనార్హం. గతంలో బదిలీలు, రేషనలైజేషన్ వంటివి వేసవి సెలవుల్లో పూర్తిచేసిన దాఖలాలు బహు స్వల్పం.