శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రజల వద్దకే రవాణా సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: ప్రజలకు మరింత చేరువగా రవాణా శాఖ సేవలను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే పలు సేవలను కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన రవాణా శాఖ ప్రజాసేవలో మరికాస్త చొరవ తీసుకొని ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షలను ఆయా గ్రామాల్లోనే ప్రత్యేక మేళాలు ఏర్పాటుచేసి అక్కడికక్కడే ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా తొలి విడత ఎంపిక చేసిన గ్రామాల్లో ఎల్‌ఎల్‌ఆర్ మేళాలు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఇందుకోసం తొలివిడత 70 గ్రామాలను ఎంపిక చేశారు. సోమవారం నగర పరిధిలోని నరుకూరులో ఎల్‌ఎల్‌ఆర్ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నారు. 24వ తేదీ వరకూ ఈ మేళా కొనసాగనుంది. సోమవారం నరుకూరు, మైపాడు, చెన్నూరు, పుట్టంరాజుకండ్రిగ, జువ్వలదినె్న, బిట్రగుంట, బండారుపల్లి, మహిమలూరు, మాంబట్టు, బివి పాలెం గ్రామాల్లోనూ, 19న ఇస్కపల్లి, గండవరం, గూడలి, పంగిలి, జమ్మలపాలెం, బ్రాహ్మణకాక, చీపినాపి, కుల్లూరు, మంగానెల్లూరు, కోటాపోలూరులలోనూ, 20న ఇనమడుగు, రేబాల, ఊటుకూరు, బద్దెవోలు, కొండాపురం, చిన్న అన్నలూరు, దువ్వూరు, అన్నారెడ్డిపాలెం, గొట్టిప్రోలు, మేనకూరు, 21న కసుమూరు, కృష్ణపట్నం, మోమిడి, పార్లపల్లి, గుండెమడకల, చాకలికొండ, ఆదూరుపల్లి, మడపల్లి, మల్లాం, మెట్టుల్లోనూ, 22న దామవరం, ఊటుకూరు, బాలిరెడ్డిపాలెం, యాటలూరు, నర్రవాడ, వికె పాడు, దేవరపాలెం, అనంతసాగరం, నెలబల్లి, పెళ్లకూరుల్లోనూ, 23న నేలటూరు, చింతవరం, డేగపూడి, గండిపాలెం, సీతారామపురం, హసనాపురం, డిసి పల్లి, కురుగొండ, దామా నెల్లూరుల్లోనూ, 24న తురిమెర్ల, సర్వేపల్లి, జయంపు, రాపూరు, తుమ్మలపెంట, గౌరవరం, నందవరం, మక్తాపురం, విన్నమాల, తాళ్వాయిపాడు గ్రామాల్లో జరగనున్నాయి. ఆయా గ్రామాలకు రవాణా శాఖాధికారుల బృందం చేరుకొని అక్కడే ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రతి బృందంలో ఒక ఎంవిఐ, ఇద్దరు రవాణా సిబ్బంది, ఇద్దరు కామన్ సర్వీస్ సెంటర్ ప్రతినిధులు ఉంటారు. ప్రతిరోజూ పది గ్రామాల్లో మేళా జరిగేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. అక్కడే ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ధ్రువీకరణ పత్రాలు కూడా అందచేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఫీజులు కూడా ఆన్‌లైన్ ద్వారా మేళాలోనే చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేళాలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారం తీసుకుంటూ వారిని మేళాకు ఆహ్వానించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో విజయవంతంగా ఈ ఎల్‌ఎల్‌ఆర్ మేళాలను నిర్వహించాలని రవాణా శాఖాధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగా జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎన్.శివరామప్రసాద్ ఇప్పటికే పలు దఫాలు అధికారులు, ఇతర సిబ్బందితో మేళా ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.