శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చూచిరాతలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 21: బట్టీ కొట్టే విధానాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీసీఈ విధానంతో చూచిరాతలకు విద్యార్థులు పాల్పడేట్లు యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఈ చూచిరాతలకు చెక్ పెట్టింది. 10వ తరగతి అంతర్గత మార్కులు తొలగింపునకు ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ సిఫార్సు చేసింది. వివరాలిలా ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా 1 నుండి పదవ తరగతి వరకు సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో పాఠశాల విద్య కొనసాగుతోంది. ఈ విధానంలో 20 మార్కులకు అంతర్గత మూల్యాంకనం, 80 మార్కులకు పరీక్ష విధానం ద్వారా మూల్యాంకనం జరుగుతోంది. దీంతో అంతర్గత మూల్యాంకనానికి కేటాయించిన 20 మార్కులను అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి విద్యార్థులకు కేటాయించడం జరుగుతోంది. దీంతో జిపిఏ 10కి 10 మార్కులు పొందే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈక్రమంలో విద్యాశాఖ అంతర్గత మార్కుల విషయాన్ని అధ్యయనానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ పలు విషయాలను అధ్యయనం చేసి విద్యాశాఖకు నివేదికను సమర్పించింది. అందులోని విషయాలను పరిశీలిస్తే ఎక్కువ శాతంలో ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు చూచిరాతలకు పాల్పడుతున్నట్లు నివేదికలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ అంతర్గత మార్కులను ప్రాజెక్టు వర్క్, రచన, రిఫలక్షన్స్, సిల్ప్ టెస్ట్ అనే నాలుగు అంశాలపై పరీక్షలు నిర్వహిస్తారు. ఇలాగే సంవత్సరం 4 దఫాలు నిర్వహిస్తారు. వీటిని ఎఫ్‌ఏ-1, ఎఫ్‌ఏ-2, ఎఫ్‌ఏ-3, ఎఫ్‌ఏ-4లుగా పిలవడం జరుగుతోంది. దీనిని నిర్మాణాత్మక మూల్యాంకనంగా వ్యవహరిస్తారు. అలాగే అర్ధ సంవత్సరం పరీక్షలను సంగ్రహణాత్మక మూల్యాంకనంగా వ్యవహరించడం జరుగుతోంది. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అంతర్గత మార్కులను విద్యార్థులకు కేటాయించడం జరుగుతోంది. అయితే కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన ఈ పరీక్షలను ఎక్కువ శాతం పాఠశాలలు కేవలం మార్కుల కోసం చూచిరాతలకు పాల్పపడుతున్నట్లు అధ్యయనం కమిటీ గ్రహించినట్లు తెలుస్తోంది. నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎస్‌ఏ -1), ఎస్‌ఏ- 2, పరీక్షా పేపర్ల సైతం గతంలో లీకయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో అప్పటికప్పుడు విద్యాశాఖ గత సంవత్సరం ఎస్‌ఏ-1, పరీక్షలను రద్దు చేసింది. ఆ సమయంలో 8, 9 తరగతులకు ఎస్‌ఏ -1 పరీక్షలను ఆబ్జెక్ట్ విధానంలో కూడా నిర్వహించారు. అందుకుగాను రూ 23 కోట్ల వరకు ఖర్చు చేశారు. కానీ ఈ విధానంలో నిర్వహించిన పరీక్షల ఓఎమ్‌ఆర్ షీట్లను సంబంధింత పాఠశాలల అధ్యాపకులతో కాక జిల్లా విద్యాశాఖకు వాల్యుయేషన్ నిమిత్తం జిల్లా విద్యాశాఖకు తరలించారు. అయితే ఆ సమాధాన పత్రాలను మూల్యాంకనం చేశారో లేదో తెలియదు కానీ చాలా మేరకు పాఠశాలల విద్యార్థులందరికీ సున్న మార్కులు రావడం కొసమెరుపు. దీంతో విద్యాశాఖ తలలు పట్టుకుంది. ఇదిలాఉండగా పదవ తరగతి పరీక్షా పత్రాలు విడుదలైన తరువాత కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఎఫ్‌ఏ -4 పరీక్షా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో తమ విద్యార్థులకు మార్కులు తగ్గాయంటూ విద్యాశాఖకు ఫిర్యాదులు చేశారు. జిపిఏ గ్రేడ్ పాయింట్ల సగటు 10కి 10 సాధించేందుకు అంతర్గత మార్కులను ఎక్కువగా కేటాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో అంతర్గత మార్కులను తొలగించాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలోనే పేర్కొన్నారు. అయితే కేవలం 10వ తరగతికి మాత్రమే అంతర్గత మార్కులు తొలగిస్తే ఒరిగే ప్రయోజనం ఏమిటని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 10వ తరగతి వరకు అంతర్గత మార్కులు తొలగిస్తారా? లేదా? 6 నుండి 10వ తరగతి వరకు అంతర్గత మార్కులు తొలగిస్తారా అనే విషయంపై ఉపాధ్యాయ వర్గాలలో తర్జనభర్జన జరుగుతోంది. ఆ విధానం సైతం లోపభూయిష్టంగా తయారైంది.