శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బ్యాంకుల పట్ల ఖాతాదారుల్లో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 21 : ఖాతాదారుల్లో బ్యాంకుల పట్ల ఆందోళన నెలకొందని లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటరావు అన్నారు. స్థానిక స్ర్తి శక్తి భవనంలో గురువారం జరిగిన జెఎల్ ఎంబీసీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బ్యాంకుల్లో దాచుకున్న తమ నగదు నిల్వల భద్రతపై ఖాతాదారుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇందుకు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న రకరకాల వదంతులే కారణమన్నారు. వచ్చిన వదంతులను తిప్పికొట్టి ఖాతాదారుల్లో నమ్మకం పెంచడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని తెలిపారు. దీని ఫలితంగా గత ఏడాది కంటే ఈ సంవత్సరం డిపాజిట్‌దారులు తగ్గుముఖం పట్టారన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే బ్యాంకుల మనుగడ కష్టమేనని అభిప్రాయపడ్డారు. అలాగే పొదుపు రుణాల వసూళ్లలో ఇంకా ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన రుణాలకు, వసూళ్లకు పొంతన కుదరడం లేదని పేర్కొన్నారు. రుణ బకాయిల వసూళ్లు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. అలాగే బ్యాంకుల్లో ఉన్న ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు సొంతానికి వాడుకుంటాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ విషయాలను ఖాతాదారులకు వివరించాల్సిన బాధ్యత బ్యాంకర్లు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా 2017-18 ఆర్థిక ప్రగతిపై మేనేజర్లతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం ఎంపీడీవోలు రాఘవేంధ్ర, రమణయ్య, ఐజక్ ప్రవీణ్, డివిజన్ పరిధిలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, ఏపీఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.