శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చెంగాళమ్మ తిరునాళ్ల ఏర్పాట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 14: సూళ్లూరుపేట చెంగాళమ్మకు అక్కగా పిలువబడే మన్నారుపోలూరు చెంగాళమ్మ తిరునాళ్ల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ వారు నిర్ణయించారు. ఈనేపధ్యంలో మంగళవారం ఏర్పాట్లను చెంగాళమ్మ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి, చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మి, కమిషనర్ వై.శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం తిరునాళ్ల కమిటీ వారిని వివరాలడిగి తెలుసుకొన్నారు. ఆలయం చుట్టు జేసీబీలతో చదునుచేసి ఆ ప్రాంగణంతో పాటు గ్రామ వీధులన్నింటిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో తిరునాళ్ల కమిటీ నిర్వాహకులు పిట్ల సుబ్రహ్మణ్యం, ఆర్‌ఎంవి, భాస్కర్‌బాబు, కనుమూరు బాబునాయుడు, కౌన్సిలర్లు దశయ్య, పొన్నా కాటయ్య, చెంగాళమ్మ పాలకమండలి సభ్యులు ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పాలరాతిపై త్రివర్ణ పతాకం
నెల్లూరు, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరానికి చెందిన ప్రముఖ సూక్ష్మ చిత్రకారుడు కాళహస్తి వెంకటశేషగిరిరావు 2 సెం.మీ. ఎత్తు, 2 సెం.మీ. వెడల్పుతో ఉన్న అతిచిన్న పాలరాతిపై భారతదేశ చిత్రపటంలో రెపరెపలాడుతున్న జాతీయ జెండాను కలర్ పెయింటింగ్‌తో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని గీసేందుకు రెండు గంటలపాటు శ్రమించినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రం ద్వారా జిల్లావాసులందరికీ ఆయన శుభాకంక్షలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.