శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రికార్డు స్థాయిలో వెయ్యి అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఆగస్టు 14: దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను గుర్తు తెచ్చుకొంటూ రికార్డు స్థాయిలో వెయ్యి అడుగుల జాతీయ జెండాను మైఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గూడూరు పట్టణంలో భారీ ర్యాలీతో పాటు ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని గూడూరు డీఎస్పీ విఎస్ రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మై ఫ్రెండ్స్ ప్రతినిధులు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. భారతీయులందరికీ ఆగస్టు 15వ తేదీ నిజమైన పండుగ రోజని, స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రాణాలర్పించిన త్యాగధనులను ప్రతి భారతీయుడు గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మైఫ్రెండ్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కోట సునీల్‌కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు అలుపెరగని పోరాటాలు కొనసాగించారని, అలాంటి వారిని గుర్తు చేసుకుంటూ మైప్రెండ్స్ సంస్థ ఆగస్టు 15వ తేదీకి ముందు రోజున వెయ్యి అడుగుల జాతీయ జెండాను పట్టణంలో ప్రదర్శించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి మరో అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ దేశం కోసం ఎందరో మహనీయులు ధన, ప్రాణాలను సైతం పణంగా పెట్టారని, వారిని స్మరించుకోవడం ఎంతో అవసరమన్నారు.
డీఎస్పీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ
మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల జాతీయ జెండాను గూడూరు డీఎస్పీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ, టవర్‌క్లాక్ సెంటర్, ఆసుపత్రి రోడ్డు, సంగం సినిమాహాలు మీదుగా కరణాలవీధి వైపు నుంచి బనిగిసాపేట, జనార్దన్‌రెడ్డి కాలనీ సమీపంలోని నారాయణ, ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలల వరకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ కె మునిగిరీష్, ఒకటో పట్టణ ఎస్సై కె శేఖర్‌బాబు, మైఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాహుల్, పి చంద్రనీల్, ఏబీవీపీ జిల్లా కార్యదర్శి మనోజ్, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.