శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అభివృద్ధి పనులపై బోర్డులు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, ఆగస్టు 17 : గత నాలుగేళ్ల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో చేపట్టిన పనులకు సంబంధించి చిత్తశుద్ధి ఉంటే వివరాలను తెలుపుతూ గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని మండల వైకాపా కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టమూరు అజయ్‌కుమార్‌రెడ్డి, యువ నాయకుడు ఎన్ కిరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్పీ సమావేశంలో మండలంలోని రాజోలపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసిన ఖర్చుల వివరాలను అడిగితే అధికారులను సమాధానం చెప్పనివ్వకుండా నిజాలు బయటపడతాయన్న ఆవేశంలో మంత్రి సోమిరెడ్డి తప్పుదారి పట్టించారన్నారు. ఈ ప్రదేశంలో హార్స్‌పవర్ ఎంత పెట్టారు? అంచనా ఎంత? జరిగిన పని ఎంత? చెప్పకుండా మంత్రి పలాయనం చిత్తగించారన్నారు. నియోకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, చేసిన పనులకు సంబంధించి గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తే, ఏ గ్రామంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డి అవినీతి జరిగిందని చెప్తుంటే, టీడీపీ నేతలు మాత్రం నీళ్లు తీసుకొచ్చి పంటలు పండించామని చెప్తున్నారని, అయితే మిల్లర్లతో మంత్రి సోమిరెడ్డి కుమ్మక్కు కావడంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులను నట్టేట ముంచిన ఘనత సోమిరెడ్డికే దక్కుతుందని తీవ్రంగా దుయ్యబట్టారు. నాడు పుట్టి కేవలం రూ.12 వేలు కూడా పలకని మసూరు నేడు రూ.17వేలకు చేరిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన కాకాణి పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి ఆ పదవీకే వనె్న తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా మండల వైకాపా నాయకులు కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, ఆవుల తులసియాదవ్, గుంజి రమేష్, మండల ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.