శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఘనంగా గంధ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఆగస్టు 17: గూడూరు పట్టణంలో వెలసి ఉన్న హజరత్‌సయ్యద్ హోషీంహుస్సేనీ జాఫర్‌మస్తాన్ అవులియావారి గంధ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విద్యుత్ దీపాలంకరణలు, మేళతాళాలతో ఫకీర్ల జరబులతో అత్యంత వైభవంగా వెల్ఫేర్‌కమిటీ అధ్యక్షుడు రియాజ్‌అహ్మద్ ఇంటి నుంచి బయల్దేరి దర్గాకు చేరిన గంధాన్ని హజరత్ వారి వద్ద ఉంచి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం దర్గా ఆవరణలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే దర్గా వద్ద ఖవ్వాలి పాటకచ్చేరి నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల ఖలీల్ అనే బాలుడి దైవసందేశం పలువురిని ఆకట్టుకుంది. ఈ గంధ మహోత్సవంలో దర్గాముజావర్ మగ్ధుంమొహిద్దీన్, ఖలీఫాల్, కదిర్‌అలీ, షాకిస్తీఉల్‌ఖాదరీ, షేక్ రియాజ్ అహ్మద్, ఇలియాజ్ అహ్మద్, రియాజ్ అహ్మద్, రెహమాన్, రంతుల్లా, సందానీ, గోల్డెన్‌గౌస్, సైదు, బాబు, షాన్‌వాజ్, కరిముల్లా, జమీర్, అమీర్, సమీర్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా ప్రారంభమైన చెంగాళమ్మ తిరునాళ్లు
* గాజుల అలంకారంలో భక్తులకు దర్శనం
సూళ్లూరుపేట, ఆగస్టు 17: సూళ్లూరుపేట చెంగాళమ్మకు అక్కగా పిలువబడే మన్నారుపోలూరు చెంగాళమ్మ తిరునాళ్లు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 50 ఏళ్ల తరువాత నిర్వహించే ఈ తిరునాళ్లను కమిటీ వారు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మొదట సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం నుంచి చీర, సారెను తీసుకొని వేదపండితులు, మేళతాళాలు, మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాహలం నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి మన్నారుపోలూరు చెంగాళమ్మకు సమర్పించారు. ముందుగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసి తిరునాళ్లు ప్రారంభించారు. పంబలోళ్ల కిలారింబులు, గొల్లల వీరజాటీల సందడితో మొదట గ్రామదేవతలకు అంబళ్లుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు తొలిరోజు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరునాళ్లలో భాగంగా అమ్మవారిని జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, చెంగాళమ్మ పాలక మండలి చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తిరునాళ్ల కమిటీ నిర్వాహకులు ఎన్‌వి మురళి, ఆర్‌ఎంవీ భాస్కర్‌బాబు, కనుమూరు బాబునాయుడు, మునస్వామి, పిట్ల సుబ్రహ్మణ్యం భక్తులకు కావాల్సిన అన్ని వసతులు దగ్గరుండి పరిశీలించారు. సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.