శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి బరిలో కొత్త నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 17: జిల్లాలోని నియోజకవర్గాల్లో టీడీపీ తరపున బరిలో దిగేందుకు కొత్త నేతలు సమాయత్తమవుతున్నారు. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరుతూ పార్టీ రాష్ట్ర నాయకత్వం తలుపు తడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ నియోజకవర్గ పరిధిలోని జలదంకి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పార్టీ అధినేత ప్రసన్నం కోసం పలు దఫాలుగా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లినేని రామారావు విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన ఆయన ప్రస్తుతం తానే అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ నాయకత్వానికి ఇప్పటికే కృష్ణారెడ్డి దరఖాస్తు అందచేసినట్లు తెలిసింది. జలదంకి ఎంపీపీగా ఎన్నిక కాకముందు సింగిల్ విండో అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా..తాను మాత్రం సామాజిక, స్వచ్చంధ కార్యక్రమాలతో నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి తన సొంత ధార్మిక సంస్థ అయిన కావ్య కృష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున నియోజకవర్గంలోని 458 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 34,500 మంది విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు అందచేయనున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో 4,900 మంది చిన్నారులకు కూడా స్కూల్ బ్యాగులు అందించబోతున్నారు. ప్రస్తుతం విద్యాభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతున్నామని, త్వరలో అన్ని రకాల సహాయ సహకార సామాజిక కార్యక్రమాలు రూపొందించుకొని నియోజకవర్గంలో చేపట్టబోతున్నట్లు కృష్ణారెడ్డి అనుచరులు చెప్తున్నారు. ఇలా ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఆయన నియోజకవర్గంలోని టీడీపీ నేతలను కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాష్టస్థ్రాయిలో ఉన్న సీనియర్ టీడీపీ నేత అండదండలతో కృష్ణారెడ్డి టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. సదరు నేత నుంచి గట్టి హామీ పొందిన ఆయన నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలకు రూపకల్పన చేసుకొని పర్యటించేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లినేని పట్ల అసంతృప్తితో ఉన్న కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే కృష్ణారెడ్డిని కలిసి తమ సమ్మతి తెలియచేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరని, ప్రతిపక్షాల చేత విమర్శలు ఎదుర్కొనే బొల్లినేని వెంకట రామారావు సొంత పార్టీలో పెరుగుతున్న పోటీని ఏ మేర తట్టుకుంటారో చూడాలి మరి.