నెల్లూరు

రుణాల రికవరీలో విఫలంపై కలెక్టర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, మార్చి 22: జిల్లాలో స్ర్తినిధికి సంబంధించిన రుణాలు వసూలు చేయకపోవడంపై జిల్లా కలెక్టర్ ఎం జానకి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డిఆర్‌డిఎ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం స్ర్తినిధి రుణాలకు సంబంధించి ఎపిఎంలు, సిసిలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జానకి మాట్లాడుతూ స్ర్తినిధి పథకం ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరానికి 40 కోట్ల రూపాయలను పొదుపు మహిళలకు ఇవ్వవలిసి ఉందన్నారు. అయితే అందులో కేవలం 19.7 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చారని తెలిపారు. తీసుకున్న రుణాలను వాటి వసూళ్లలో కూడా కనీస మెరుగుదల లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికి కేవలం ఐదు కోట్ల రూపాయలను మాత్రమే వసూలుచేయడం ఏమిటని ప్రశ్నించారు. స్ర్తినిధి రుణాలను ఇవ్వడంలోను, తీసుకోవడంలోను రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా అట్టడుగు స్థాయిలో ఉండడం బాధాకరమన్నారు. నెలాఖరులోపు రుణాలను వసూలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పిడి చంద్రవౌళి, మెప్మా పిడి సోమయ్య, ఎపిఎంలు, సిసిలు పాల్గొన్నారు.