శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆశీర్వదిస్తే ఆత్మకూరు నుండి పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 13 : తనను ఆశీర్వదిస్తేనే రానున్న ఎన్నికల్లో ఆత్మకూరు నుండి పోటీ చేస్తానని మాజీ శాసనసభ్యుడు బొల్లినేని కృష్ణయ్యనాయుడు అన్నారు. ఆత్మకూరు పట్టంలో శనివారం విస్తృతంగా పర్యటించిన ఆయన పలువురు హితులు, సన్నిహితులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రానున్న ఎన్నికల్లో గెలిపిస్తానని మాటిస్తేనే పోటీలో ఉంటానని అన్నారు. ప్రజల మద్దతు లేకుండా ఎన్నికల్లో విజయం సాధించే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కేవలం డబ్బే పరమావధి కాదన్న ఆయన ప్రజాభిమానం అత్యవసరమన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో తనకు చేతనైన మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. నియోజవర్గంలో రైతులకు సాగునీరు అందించేందుకు తన కంపెనీ ప్రొక్లైన్‌లు కాలువల ఆధునీకరణ పనులు చేపడుతూనే ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రాగి వనమ్మ, మల్లిక మస్తాసుబ్బయ్య, మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, భర్త కృష్ణారెడ్డి, మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరావుపల్లి మాజీ సర్పంచ్ శివకోటారెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు, మైనారిటీ రాయకులు కాలేష, ఖాజావలి, 1వ వార్డు జాలయ్య నగర్‌లోని సత్యం, వెంకటరమణయ్య, శ్రీనివాసులు, ముస్తాపురం గ్రామంలో సుబ్బారావు, నాదెండ్ల శ్రీనివాసులు, చంద్రయ్య, గురవయ్య, 10వ వార్డులో మాజీ వార్డు సభ్యులు పూనూరు రమేష్‌రెడ్డి, చల్లా మోహన్‌రెడ్డి, చల్లా అశోక్‌రెడ్డి, 11వ వార్డులో మాజీ వార్డు సభ్యులు చల్లా వెంకటేశ్వర్లురెడ్డి, 16 వార్డులో మైనారిటీ నాయకులు అహ్మద్, 10వ వార్డులో పెద్దలు గుండాల హనమాన్‌రెడ్డి, 23 వార్డులో కౌన్సిలర్ చెరుకూరు పద్మావతమ్మ, 23 వార్డులో పోగాకు బోర్డు మాజీ వైస్ ఛైర్మెన్ చెరుకూరు రమణయ్య నాయుడు, 22వ వార్డులో సాగునీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ మాదాల మస్తాన్‌నాయుడు, లక్ష్మీసాయి డెయిరీ యజమాని శ్రీనివాసులు, కృపాకర్, వీవర్స్ కాలనీలో కోనంకి తిరుపతి, 21వ వార్డులో కౌన్సిలర్ కొత్తపల్లి రమేష్ ఇతర ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ శివారులో ఏర్పాటు కానున్న ఆటోనగర్‌లో వౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అలా వీలుకాని పరిస్థితుల్లో తన సొంత నిధులను అభివృద్ధి పనులకు వెచ్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట బొల్లినేని కిమ్స్ చైర్మన్ గిరినాయుడు, వైస్ చైర్మన్ తుమ్మల చంద్రారెడ్డి, నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.