శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

టెన్త్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, మే 10: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 34,287 మంది పరీక్షలు రాయగా వీరిలో 31,868 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 17,772 మందికి గాను 16,451 మంది ఉత్తీర్ణులయ్యారు. 16,515 మంది బాలికలకుగాను 15415 మంది పాస్ అయ్యారు. ప్రైవేటు స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఉత్తమ మార్కులు సాధించారు. అధిక శాతం ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు జిపిఏ 10కి 10 మార్కులు సాధించి పాఠశాలల కీర్తికెరటాన్ని ఎగురవేశారు.
10వ స్థానంలో జిల్లా
జిల్లాలో జరిగిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 10వ స్థానంలో నిలిచింది. మొత్తం 34,287 మందికి గాను 31,868 మంది ఉత్తీర్ణత సాధించి 92.94 శాతంలో నిలిచింది. గత ఏడాది వలే ఈ ఏడాది కూడా ఉత్తీర్ణత శాతంలో బాలికలు నిలిచారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కెఎన్‌ఆర్ ఫస్ట్
పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోనే నెల్లూరు నగరానికి చెందిన ప్రభత్వ మున్సిపల్ పాఠశాల కెఎన్‌ఆర్ హైస్కూల్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎన్.లోకేష్ 10-10కి మార్కులు సాధించి జిల్లాలోనే ప్రధమంగా నిలిచాడు. అలాగే ఎస్.సతీష్ 9.8, ఎన్.కార్తీక్ 9.8, వి.నరేంద్ర 9.7 పాయింట్లు సాధించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు విజయ్‌ప్రకాష్‌ను పలువురు అభినందించారు. స్కూల్ ఫస్ట్‌గా నిలిచిన లోకేష్‌ను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ సన్మానించారు.