శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

‘ఐటీ దాడులతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, అక్టోబర్ 13: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడు అన్నారు. శనివారం నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నల్లరిబ్బన్లతో ఆ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విభజన అనంతరం 16 వేల కోట్లతో లోటుబడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులను తెచ్చేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాలపై కక్ష కట్టిన ప్రధాన నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, టీడీపీ నాయకులపై ఐటీ దాడులు నిర్వహిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న బీజేపీని రాబోవు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఇకనైనా ఇలాంటి దాడులు మానుకోకపోతే పోరాటాలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ ఫెడరేషన్ నాయకులు షేక్ అమృల్లా, అఖిల్ చౌదరి, సుమదుర్, భరత్, వెంకటేష్, సురేష్, నవీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.