శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అందరి సహకారంతోనే ఆసుపత్రి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, డిసెంబర్ 11 : వైద్యులు, సిబ్బంది, ప్రజలు, దాతలు, రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖుల సహాయ సహకారాలతోనే ఆత్మకూరు వైద్యశాల అభివృద్ధి దిశగా సాగిపోతోందని వక్తలు అన్నారు. స్థానిక జిల్లా వైద్యశాల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ వైద్యులు, శాసన సభ్యులు బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి, మాజీ వైద్య నిపుణులు డాక్టర్ కొండారెడ్డి, వైద్యశాల అభివృద్ధి అధికారిణి, ఆర్డీవో సువర్ణమ్మలను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాధారణ ధర్మాసుపత్రిని మొదటి ప్రభుత్వ వైద్యులుగా పనిచేసిన డాక్టర్ కొండారెడ్డి, సుందరరామిరెడ్డిలు ప్రజలకు చేరువ చేశారన్నారు. వారికి తోడు పట్టణ పెద్దలు, రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారుల కృషితో జిల్లా వైద్యశాల స్థాయికి చేరుకుందన్నారు. వైద్యశాల అప్‌గ్రేడ్ అయిన దగ్గర నుండి ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందన్నారు. నేడు వైద్యశాలలో కార్పోరేట్ వైద్యశాలకు తీసిపోకుండా అత్యాధునిక యంత్రాలు, పరికరాలు సమకూరాయన్నారు. ఆత్మకూరు జిల్లా వైద్యశాలను ధర్మాసుపత్రి అంటే నమ్మశక్యం కాదన్నారు. అనంతరం వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చెన్నయ్య మాట్లాడుతూ వైద్యశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బంది కృషి చాలా ఉందని కొనియాడారు. అలాగే రోగుల పట్ల వైద్యులు ఆత్మీయంగా మెలగడంతో రోగుల నమ్మకం చూరగొన్నామన్నారు. నేడు ఆత్మకూరులోని వైద్యశాలకు నియోజకవర్గం నుండే కాక, కడప, ప్రకాశం జిల్లాల నుండి కూడా రోగులు వస్తున్నారని తెలిపారు. రోగుల వసతి సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన వస్తువులను దాతల సహకారంతో సమకూరుస్తున్నట్లు తెలియజేశారు. వైద్యశాల సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ రక్త నిల్వ కేంద్రం, కాయకల్ప అవార్లును అందజేసిందని తెలిపారు. అందరి సహకారంతో వైద్యశాలను రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యశాలకు స్ట్ఫా నర్సులు, సిబ్బంది కొరత ఉందని త్వరలోనే ఆ పరిస్థితిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నర్సింగ్ విద్యార్థినులు, వైద్యశాల సిబ్బంది పిల్లలు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ విద్యార్థిని అలేఖ్య శ్రావ్యంగా ఆలపించిన ‘ఏ జిందగీ చెలేగయే’ హిందీ గీతం జీవిత విలువను చాటింది. ఈ కార్యక్రమంలో డిసీహెచ్ ఎస్ సుబ్బారావు, ఉప పరిపాలనాధికారిణి డాక్టర్ ఉషాకుమారి, టీడీపీ నాయకులు చండ్రా సుబ్బానాయుడు, కావలి, గూడూరు సూపరింటెండెంట్లు, శానిటేషన్ ఏజన్సీ నిర్వాహకులు సీయల్ రావు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.