శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గంగిరెడ్డిపల్లిలో విజృంభించిన జ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయగిరి, డిసెంబర్ 14: మండల పరిధిలోని గంగిరెడ్డిపల్లిలో ఓ వ్యక్తికి డెంగ్యూ సోకడంతో పాటు పలువురు జ్వరాల బారిన పడి అల్లాడుతున్నారు. గ్రామంలో గత నెలరోజుల నుంచి పలువురికి జ్వరాలు సోకాయి. దీంతో గ్రామానికి చెందిన మబ్బు వెంకటేశ్వర్లు, సులోచన, సుమతి కుటుంబసభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం వెళ్లిగా అక్కడి వైద్యులు వెంకటేశ్వర్లును పరీక్షించి డెంగ్యూ అని నిర్ధారించినట్లు చెప్తున్నారు. దీంతో శుక్రవారం ఇంటికి చేరుకొని జ్వరంతో బాధపడుతున్నారు. మిగతా ఇద్దరికి వైరల్ జ్వరాలుగా నిర్ధారించినట్లు తెలిపారు. గ్రామంలో సగం మందికి పైగా జ్వరపీడితులు ఇంటి వద్దనే బాధపడుతున్నారు. వైద్యసేవలు అందించాల్సిన వైద్యసిబ్బంది సక్రమంగా రావడం లేదని గ్రామస్థులు పేర్కొన్నారు. వైద్యశాలలో వైద్యులు లేకనే ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో జ్వరాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

‘జీవిత బీమా ఎంతో ఉపయోగకరం’
వింజమూరు, డిసెంబర్ 14 : జీవిత బీమాతో ఎంతో ఉపయోగకరమని ఎస్‌బిఐ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఒల్లూరుపల్లి కోటేశ్వరరావు పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివంగత డాక్టర్ చెన్నుబోయిన మాల్యాద్రి గృహ నిర్మాణం కోసం తమ బ్రాంచిలో రుణం తీసుకునే తరుణంలో జీవిత బీమా చేయడంతో ఆయన మరణాంతరం గృహ రుణం పూర్తిగా మాఫీ చేశారని తెలిపారు. అందుకు సంబంధించి తీసుకున్న మొత్తం రుణాన్ని జీవిత బీమా సంస్థ బ్యాంకుకు చెల్లించిందన్నారు. బ్రాంచ్ మేనేజర్ విఎల్‌ఎన్ మూర్తి డాక్టర్ మాల్యాద్రి భార్య శ్రీదేవికి శుక్రవారం మిగిలిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఆమెకు అందజేశారు.

తుఫాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం నివారించాలి
* గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్
వాకాడు, డిసెంబర్ 14 : తుఫాన్ ప్రభావం వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తహశీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సబ్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో తుఫాన్ సంభవించినప్పుడు తలెత్తిన పరిస్థితులు తెలిసే ఉంటాయని, ముందస్తు ప్రణాళికలతో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాతావరణశాఖ శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఈదురుగాలులు అధికంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసిన దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉంటూ తీరప్రాంతీయులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత మంచినీరు, మందులు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి పంచాయతీకి ప్రత్యేక అధికారిని నియమించడంతోపాటు జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్లు అత్యవసర మందులను పునరావాస కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీటీ మల్లికార్జున, ఎంపీడీవో ప్రమీలరాణి, ఇతర మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.