శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జనార్దన్‌రెడ్డి కాలనీలో కార్టన్ సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 14 : నగరంలోని జనార్దన్‌రెడ్డి కాలనీలో శుక్రవారం తెల్లవారుఝామున జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ ఆదేశాల మేరకు నగర, సీసీఎస్ డీఎస్పీలు మురళీకృష్ణ, బాలసుందరరావుల నేతృత్వంలో 135 మంది పోలీస్ సిబ్బంది కార్ట్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ కాలనీలోని ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 23 మంది అనుమానితులను, రికార్డులు సరిగాలేని 40 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల్లో ఇద్దరు పాత నేరస్తులను పోలీసు సిబ్బంది గుర్తించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు మాట్లాడుతూ నగరంలో నేరాల నివారణ కోసం, అనుమానితులను, అనుమానంగా ఉన్న వాహనాలను తనిఖీ చేసేందుకు ఈ కార్టాన్ సెర్చ్ చేస్తున్నట్లు తెలిపారు. నగరవాసులు కూడా తమ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారి గురించి, వాహనాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ సిఐ బాజీజాన్‌సైదా, నవాబుపేట సిఐ వెంకట్రావు, చిన్నబజార్ సిఐ సుభాన్, బాలాజీనగర్ సిఐ వేణుగోపాల్‌రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రముఖ బీజేపీ నేత ఆమంచర్ల అస్తమయం
నెల్లూరు, డిసెంబర్ 14: నగరంలోని ప్రముఖ ఆడిటర్, బీజేపీ సీనియర్ నేత ఆమంచర్ల శంకరనారాయణ శుక్రవారం తెల్లవారుఝామున స్థానిక బృందావనంలోని తన స్వగృహంలో గుండెపోటుకు గురై మరణించారు. నెల్లూరు రాజకీయాలతో విడదీయలేని సంబంధం ఉన్న శంకరనారాయణ ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడుతో కలిసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వృత్తిరీత్యా ఆయన ఆడిటర్ కావడంతో అందులోనే స్థిరపడిపోయారు. ఓ పక్క వృత్తి, మరో పక్క రాజకీయాల్లో ఆయన తనదైన శైలిలో రాణించారు. ఓ దఫా నెల్లూరు నుంచి శాసనసభకు పోటీ చేశారు. ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి బీజేపీతో ఆయనకు 30 ఏళ్ల రాజకీయ బంధం ఉంది. పూర్వ విద్యార్థిగా నగరంలోని విఆర్ విద్యాసంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆయన పోరాటమే కారణం. విఆర్ విద్యాసంస్థల పాలకవర్గ ఎన్నికల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేసి, సుప్రీంకోర్టుకు వెళ్లి చివరకు విజయం సాధించారు. ప్రస్తుతం పాలకవర్గ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో తాను సాధించిన విజయం తాలూకు ఫలితాన్ని చూడకుండానే ఆయన మృతి చెందారని ఆయన అభిమానులు, కళాశాల పూర్వ విద్యార్థులు వాపోయారు.
ప్రముఖుల సంతాపం
శంకరనారాయణ మృతి పట్ల ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితుడిని కోల్పోయానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శంకరనారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అలాగే మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణలు ఆయన నివాసానికి చేరుకొని పార్దివదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులకు సంతాపం తెలియచేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెళ్లకూరు సురేంద్రరెడ్డి తదితరులు మృతదేహాన్ని దర్శించి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

యోగాతోనే ఏకాగ్రత
* ముగిసిన యోగా పోటీలు
బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబర్ 14: పట్టణంలోని దొడ్ల లక్ష్మీనరసారెడ్డి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఏపీ సీఎం కప్ యోగా ఛాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా శుక్రవారం అండర్-17 బాలబాలికల జట్ల ఈవెంట్స్ జరిగాయి. బాలుర విభాగంలో కృష్ణా జిల్లా 440 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో వరుసగా విజయనగరం 432.5, నెల్లూరు జిల్లా 420.5 పాయింట్లతో నిలిచాయి. అదేవిధంగా బాలికల విభాగంలో నెల్లూరు జట్టు 442 పాయింట్లు సాధించి మొదటి స్థానం కైవసం చేసుకుంది. కృష్ణా జిల్లా 381, కడప జిల్లా 374 పాయింట్లు సాధించి రెండవ, మూడవ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేశారు. వారు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులు
బాలురు అండర్-17 యోగా పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరచి ఎంపికైన బాలురలో కృష్ణా జిల్లాకు చెందిన సంపత్‌కుమార్ 198.5 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఆ తరువాత విజయనగరంకు చెందిన టి సాయి 189.5 పాయింట్లు, విజయనగరం జిల్లాకు చెందిన బి హరీష్ 179.5 పాయింట్లు, కృష్ణాకు చెందిన వినీత్ భార్గవ్ చౌదరి 179 పాయింట్లు, గుంటూరుకు చెందిన ఎం శివనాయక్ 165 పాయింట్లు, కె కృష్ణమోహన్ 161.5 పాయింట్లు (కృష్ణా జిల్లా), విశాఖపట్టణంకు చెందిన భాస్కర్‌రెడ్డి 150.5 పాయింట్లు సాధించి వరుసగా తరువాత స్థానాలలో నిలిచారు.
బాలికల్లో అండర్ 17 విభాగంలో ఎంపికైన క్రీడాకారులు
ప్రకాశం జిల్లాకు చెందిన బి ఐశ్వర్య 216 పాయింట్లు, నెల్లూరుకు చెందిన మంజూష 197 పాయింట్లు, ఎస్ లీనా 185 పాయింట్లు, కడపకు చెందిన వై శైలజ 183 పాయింట్లు, అనంతపురానికి చెందిన వై మంజుల 179.5 పాయింట్లు, కడపకు చెందిన ఏ నిషీత 174 పాయింట్లు, కృష్ణకు చెందిన కె లక్ష్మి 174 పాయింట్లు సాధించి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.
అండర్ 14 బాలురు :
యోగా జాతీయ పోటీల్లో అండర్ 14 బాలుర జట్టుకు ఎంపికైన క్రీడాకారులు నెల్లూరుకు చెందిన గంగాప్రసూన్ 200 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచారు. అనంతరం వరుసగా నెల్లూరుకు చెందిన వర్ధి 198.5 పాయింట్లు, ప్రకాశం జిల్లాకు చెందిన బి గణేష్ 193.5 పాయింట్లు, వెస్ట్ గోదావరికి చెందిన సిహెచ్ రవీంద్ర 191.5 పాయింట్లు, విజయనగరంకు చెందిన యశ్వంత్ సాయి 176 పాయింట్లు, విజయనగరంకు చెందిన సాయిప్రసాద్ 170.5 పాయింట్లు, అనంతపురానికి చెందిన బి శివసాగర్ 161.5 పాయింట్లు సాధించి తరువాత స్థానాల్లో ఉన్నారు.
బాలికల్లో అండర్ 14:
బాలికల విభాగంలో నెల్లూరు జిల్లా చెందిన గుణశ్రీ 233.5 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో నెల్లూరు చెందిన బి తనుశ్రీ 229 పాయింట్లు నెల్లూరుకు చెందిన సిహెచ్ సాయి చేతన 227.5 పాయింట్లు నెల్లూరుకు చెందిన ఎం దేవకీ 227 పాయింట్లు కృష్ణకు చెందిన కె సింధు 216.5 పాయింట్లు, నెల్లూరుకు చెందిన కె లక్ష్మీప్రియ 209.5 పాయింట్లు, ప్రకాశంకు చెందిన జి కావేరి 208.5 పాయింట్లతో ఆ తరువాత స్థానాలలో నిలిచారు. ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్ర జట్టు తరపున పాల్గొననున్నారు. పోటీల అనంతరం క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి, దశరధరామిరెడ్డి, డాక్టర్ తిరుమలేష్, పీడీ పద్మనాభం, వెంకటేశ్వర్లు, వెంకటసుబ్రహ్మణ్యం కేశవ్, వ్యాయామ ఉపాధ్యాయులు వేణు, నరసింహులు, మహేష్, సురేష్, మునికుమార్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.