శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జూన్ 3లోగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రుసుం చెల్లించండి: డిఇఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, మే 13: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జూన్ 3వ తేదిలోగా పరీక్షా రుసుమును చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి డి. ఆంజనేయులు తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు చెల్లించిన పరీక్ష రుసుమును జూన్ 6వ తేదీలోగా చలానా రూపంలో జమ చేసి నామినల్ రోల్స్‌ను కంప్యూటర్ ఎక్ట్రాక్స్‌తో కలిపి జూన్ 9వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందచేయాలన్నారు. జూన్ 16వ తేది నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
జవాబు పత్రాల దరఖాస్తులు సిద్ధం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల రాసిన వారి జవాబు పత్రాల జెరాక్స్ కాపీలు కావాల్సిన వారి కొరకు దరఖాస్తులు సిద్ధంగా ఉన్నాయని డిఇఓ తెలిపారు. జవాబు పత్రాల జెరాక్స్ కాపీలు కావాల్సిన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బిఎస్‌ఇఎపి.ఒఆర్‌జి వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. డిఇఓ కార్యాలయంలో కూడా పొందచవ్చని తెలిపారు. జవాబు పత్రాలు కావాల్సిన వారు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చలానా కట్టి దరఖాస్తు పారంతోపాటు హాల్ టిక్కెట్ జెరాక్స్ కాపీ, డూప్లికేట్ మార్కుల జాబితాలను జతచేసి దరఖాస్తుపై పాస్‌పోర్టు సైజు ఫొటోను అంటించి సంబంధిత ప్రధానోపాధ్యాయుల చేత సంతకాలు చేయించి డిఇఓ కార్యాలయంలో ఈ నెల 23వ తేదీలోగా అందచేయాలన్నారు. మార్కుల రీకౌంటింగ్ కొరకు రూ.500 చలానా కట్టి దరఖాస్తును నేరుగా సంచాలకులు, ప్రభుత్వ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారికి 23వ తేదీలోగా పంపాలని తెలిపారు. నగదు చలానా రూపంలో పంపాలని, డిడిల రూపంలో చెల్లవని చెప్పారు.