శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పులకరించిన పులికాట్ తీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 21: పక్షుల పండుగతో పులికాట్ తీరం పర్యాటకులతో పులకరించిపోయింది. అక్కడకు వచ్చిన సందర్శకులకు సమాచారం, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడక తప్పలేదు. పక్షుల పండుగ జరిగే సమయంలో ప్రతియేటా సూళ్లూరుపేట-శ్రీహరికోట మార్గాల్లో సందర్శకుల కోసం అక్కడక్కడ షామినాలు వేసి తాగునీరు తదితర వసతులు కల్పించేవారు. దీనికితోడు అక్కడక్కడ సమాచార కేంద్రం ఏర్పాటు చేసి పక్షులను వీక్షించేందుకు వచ్చిన సందర్శకులకు పూర్తి సమాచారం ఇచ్చేవారు. దీనికితోడు జిల్లా అధికార యంత్రాంగం కూడా దీని గురించి పట్టించుకోలేదు. జిల్లా అధికార బృందం పక్షుల పండుగ జరిగే వేదిక వరకే పరిమితమవ్వడంతో పులికాట్ సరస్సు, అట్టకానితిప్ప వద్ద ఉన్న పర్యావరణ విజ్ఞాన కేంద్రానికి వెళ్లేందుకు బస్సుల సౌకర్యం కల్పించలేదు. దీనికితోడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు సైతం మనకేమన్నట్లు వౌనంగా ఉండిపోయారు. ఉదయం నుండే సరస్సులో పక్షులను తిలకించేందుకు సందర్శకులు చేరుకున్నారు. సూళ్లూరుపేట నుండి శ్రీహరికోట వెళ్లే మార్గమధ్యంలో కుదిరి, అట్టకానితిప్ప వద్ద అక్కడక్కడ సందర్శకులు పక్షులు, పులికాట్‌ను వీక్షిస్తూ సందడి చేశారు. అట్టకానితిప్ప విజ్ఞాన కేంద్రం వద్దనున్న పక్షుల నమూనాలు, వివిధ రకాలు చెట్లు, వనమూలికలు, జంతు కళేబరాలు తదితర వాటిని తిలకించే విధంగా ప్రత్యేక వసతులు కల్పించారు. సరస్సు పొడవునా ఎక్కడ చూసినా జనాలతో సందడి వాతావరణం కన్పింపించింది. సరస్సులో కొందరు యువతీ యువకులు అక్కడే ఉన్న మత్స్యకారుల పడవల్లో కేరింతలు కొడుతూ ఆనందంగా షికారు చేశారు. పక్షుల పండుగ జరిగే సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో సందర్శకుల ఊసే కనిపించకపోయినా పులికాట్ సరస్సులో ఇటు పక్షుల కిలకిలరావాలతో పాటు జన సందడితో సందడి వాతావరణం నెలకొంది.

కళ తప్పిన పక్షుల పండుగ
* రెండో రోజు అదే తీరు * కనిపించని సందర్శకుల సందడి
సూళ్లూరుపేట, జనవరి 21: పక్షుల పండుగ కళ తప్పింది.. ఎప్పుడు ఈ పండగంటే జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో విచ్చేసి పులికాట్, నేలపట్టుతో పాటు బివి పాళెం పడవలరేవులో బోటు షికారులకు సందర్శకుల తాకిడి అధికంగా ఉండేది. కానీ సూళ్లూరుపేటలో ఆదివారం ప్రారంభమైన పక్షుల పండుగ రెండో జోరు ఊపందుకోలేదు. సందర్శకులు సందడి లేక ఏర్పాటు చేసిన స్టాల్స్ వెలవెలబోయాయి. ఎక్కడ చూసినా ప్రజలు గుంపులు గుంపులుగా చేరి ఇవేమి ఏర్పాట్లంటూ చర్చించుకోవడం విశేషం. పక్షుల పండుగకు రెండో రోజైన సోమవారం కూడా విద్యార్థులే కన్పించారు. పండుగ జరుగుతున్న జూనియర్ కళాశాల మైదానంలో క్రీడాకారులు తప్ప సందర్శకులు ఎక్కడా లేరు. ఎప్పుడూ పక్షుల పండుగ రెండో రోజు ఉదయం నుండే జనసంద్రంగా మారే జూనియర్ కళాశాల మైదానం బోసిపోవడం గమనార్హం. ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా వచ్చి ఏర్పాట్లు చూడకపోవడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ఒక్క షార్ స్టాల్ తప్ప ఇతర స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకొనేలా లేవు. దీనికితోడు మొన్నటి వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు కూడా కనబడలేదు. దీనికితోడు గత ఏడాది షార్‌ను సందర్శించే అవకాశం కల్పించారు. ఈసారి లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా రాలేదు. సందర్శకులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకొచ్చి మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ చూపించారు. అసలు ఈమాత్రం కూడా విద్యార్థులు లేకపోతే ఈసారి ఫెస్టివల్‌కు ఆ అరకొర జనం కూడా కనిపించి ఉండరు. నిర్వాహకులు వచ్చిన అరకొర జనానికి సైతం వసతులు కల్పించలేకపోయారు. అట్టకానితిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రం, పులికాట్ తీరంలో సందర్శకులు పక్షులను వీక్షించారు. కనీసం పక్షి ప్రేమికులకు కావాల్సిన తాగునీటి వసతి కూడా కల్పించలేదు.