శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కూలిన సంతపేట మార్కెట్ భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 25: నెల్లూరు సంతపేటలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ భవనానికి సంబంధించిన స్లాబు సోమవారం ఉదయం కూలిపోయింది. భవనంలోని బయట భాగంలో కొంతమేర వరకు స్లాబు ఒరిగిపోయి దర్శనమిచ్చింది. భవన నిర్మాణ పనులు చేస్తున్న సంస్థ ఆదివారం రాత్రే స్లాబు వేసింది. సోమవారం ఉదయం వచ్చి చూసేసరికే ముందుభాగం మొత్తం ఒరిగిపోయి కనిపించింది. అయితే నిర్లక్ష్యమా, నాసికరమా అనేది తెలియాల్సి ఉంది. భవనం లోపలి భాగంలో స్లాబు యథాతథంగానే ఉంది. బయట ప్రాంతంలోనే కూలింది. భవనం బయట ప్రాంతంలో స్లాబుకు సపోర్టుగా పెట్టే ఐరన్ పోల్స్‌ను, సవక కర్రలను నిర్లక్ష్యంగా పెట్టినా అది కూలే అవకాశం ఉంది. సెంట్రింగ్ వర్క్ సరిగా చేయపోవడమే ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు నాణ్యత పాటించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, రూప్‌కుమార్ యాదవ్ అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు అద్భుత టెక్నాలజీ అందిస్తున్నామని ప్రకటనలు చేసిన మంత్రి నారాయణ షేర్‌వాల్ టెక్నాలజీతో నిర్మించిన భవనాలు కూలిపోవడంపై స్పందించాలన్నారు. నారాయణ సంస్థల భవనాలు ఎంతో నాణ్యతగా నిర్మించే నారాయణ ప్రజల ఇళ్ళను, మార్కెట్లను షేర్‌వాల్‌తో నిర్మిస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సంతపేట మార్కెట్‌కు సంబంధించి నూనంగా నిర్మిస్తున్న ఓ స్లాబ్ పూర్తిగా కూలిపోవడం దారుణమన్నారు. వీటి నిర్మాణంలో కేవలం బూడిద తప్ప కాంక్రీట్ ఎక్కడా కనిపించడం లేదన్నారు. కేవలం సంతపేట మార్కెట్ పరిస్థితి ఇలా ఉంటే ఇక పెన్నా నది పక్కన జనార్థన్‌రెడ్డి కాలనీలో నిర్మించిన ఇళ్ళ పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని అన్నారు. సంతపేట మార్కెట్ శ్లాబు కూలిపోతే ఇప్పటివరకు మంత్రి నారాయణ అక్కడకు వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు భరోసా కల్పించకపోవడం శోచనీయం అన్నారు. మంత్రిని చూసి భయపడుతున్న అధికారులు కనీసం జరుగుతున్న అభివృద్ధిలో నాణ్యతను పరీక్షించేందుకు కూడా ముందుకు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.