శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

టోల్‌ప్లాజాను అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, మే 16: నగర ప్రజలు టోల్‌ప్లాజా వద్దని ముక్తకంఠంతో ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం వాటి పతనానికి నాంది అని టోల్‌ప్లాజా నిర్మాణ వ్యతిరేక కమిటీ అయిన అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. సోమవారం టోల్‌ప్లాజాకు వ్యతిరేకంగా బుజబుజనెల్లూరు సమీపాన మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ, ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, అంతంమాత్రం కాదని అన్నారు. ప్రజల ప్రాణాలకన్నా ఒక వ్యక్తి ఆర్థిక స్వావలంబన కోసం టోల్‌ప్లాజా నిర్మాణం చేపట్టడం సమంజం కాదని ఆయన అన్నారు. ఇప్పటికే అనేక పర్యాయాలు ఢిల్లీ నుండి గల్లీ వరకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికి స్పందంన లేకపోవడం దారుణమన్నారు. మా పని మేము చేసుకుపోతామనేటట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఆయన ఎండగట్టారు. ఎట్టి పరిస్థితులలో టోల్‌ప్లాజా నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని ప్రత్యక్ష పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. అనంతరం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నెల్లూరు సొంత ఊరు అని చెప్పుకొని తిరుగుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నెల్లూరు ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వరా అని ప్రశ్నించారు. టోల్‌ప్లాజా నిర్మాణం ఆపని పక్షంలో వెంకయ్యనాయుడు ఇంటి ముందే నిరసన చేపడతామని ఆయన హెచ్చరించారు. నగరం నడిబొడ్డున టోల్‌ప్లాజా నిర్మాణం చేయడం వల్ల దానిని తప్పించుకోవడం కోసం భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించడం జరుగుతుందని తద్వారా ప్రజల ప్రాణాలు, రోడ్లు, దీనస్థితికి చేరిపోతాయని ఆయన తెలిపారు. ప్రజల ప్రాణాలకన్నా ప్రభుత్వానికి ఆదాయమే మిన్న అనే రీతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. అనంతరం మేయర్ అజీజ్ మాట్లాడుతూ, టోల్‌ప్లాజా నిర్మాణం చేయకూడదని, కార్పొరేషన్‌లో ఏకగ్రీవ తీర్మానం చేశామని ఆయన తెలిపారు. టోల్‌ప్లాజా నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం కూడా వ్యతిరేకమని ప్రజల కోసం అహర్నిశలు కృషిచేసే చంద్రబాబునాయుడు దృష్టికి, జిల్లా మంత్రి నారాయణ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి తగిన పరిష్కార మార్గం తెలుసుకుంటామని అన్నారు. టోల్‌ప్లాజా నిర్మాణ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని అందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఎంతమాత్రం ఉండదని ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ధర్నా జరుగుతున్న సమయంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అనంతరం పోలీసులు ధర్నా ప్రాంతానికి వచ్చి పరిస్థితి చక్కదిద్దారు. ధర్నా అనంతరం అఖిలపక్షం నాయకులు ఎన్‌హెచ్‌పి అథారిటీ కార్యాలయానికి వెళ్లి కొద్దిసేపు కార్యాలయం ఎదుట ధర్నా చేసి అక్కడున్న అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, లోక్‌సత్తా, వివిధ సంఘాల నాయకులు, లారీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

....