శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సూళ్లూరుపేటలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 17: నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయిలో ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన జనానికి చల్లని వానతో ఉపశమనం కలిగినట్లయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో సోమవారం అర్ధరాత్రి నుండి సూళ్లూరుపేటలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురవడంతో పట్టణమంతా తడిసి ముద్దయింది. రెండు నెలల నుండి మండుటెండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరైన జనానికి ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. మంగళవారం ఉదయం నుండి ఆగకుండా భారీ వర్షం కురుస్తుండడంతో పట్టణంలోని వీధులన్నీ నీటమునిగాయి. సాయినగర్, గణపతినగర్, గాండ్లవీధి, ఇందిరానగర్, పాట్టిశ్రీరాములు వీధి, ఇసుకమిట్ట, జిఎన్‌టి రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలవడంతో పాదచారులు, వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. రోజంతా విడవని వానతో ప్రజలు, ఉద్యోగులు పలు అవస్థలు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పని నిమిత్తం వచ్చే వారికి ఇక్కట్లు తప్పలేదు. ముఖ్యంగా కొరిడి-పేర్నాడు, వేనాడు రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో గుంతలు ఏర్పడి ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. భూగర్భ జలాలు అడుగంటి పశువులకు సైతం మేత లేకపోవడంతో ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. పలు గ్రామాల్లో ధాన్యం రాశుల కిందకు వర్షం నీరు చేరడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. మరో రెండు రోజులపాటు వర్ష సూచనలతో రైతులు తమ ధాన్యం రాశులను తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.