శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వానా వానా వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 17: వేసవితాపంతో విలవిల్లాడుతున్న జిల్లా ప్రజలను సేదతీర్చేందుకు అనుకోని అతిథిలా వచ్చింది వర్షం. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా మంగళవారం వర్షం కురిసింది. ముఖ్యంగా గూడూరు డివిజన్ పరిధిలో భారీ వర్షపాతమే నమోదైంది. గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోతలు పూర్తిచేసుకుని కళ్లాలకు చేరుకున్న ధాన్యపు రాశులు తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లో అనుకోకుండా వచ్చిన భారీ వర్షం మూలాన రాశులు తడిసి ముద్దయ్యాయి.
స్తంభించిన నగరవాసం
మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ నెల్లూరు నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. తేలికపాటి జల్లులుగానే రోజంతా వర్షం కురవడంతో నగర జీవనం స్తంభించింది. జన సంచారం కాస్త పలుచగా కనిపించింది. ముఖ్యంగా పాదచారులు, మోటార్‌సైకిళ్లపై ప్రయాణించే వారు ఈ వర్షానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే గత కొంతకాలంగా నగరంలో విపరీతంగా కాస్తున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. నిన్నటివరకూ 40 డిగ్రీల వరకూ ఉన్న పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయి వర్షం కురవడంతో ఇంతకాలం ఎండ వేడిమికి అల్లాడిన నగరవాసుల్లో ఒకింత సంతోషం వ్యక్తం కావడం గమనార్హం. అయితే నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చినవారు మాత్రం కాస్త అసహనానికి గురయ్యారు. మధ్య మధ్యలో వర్షం తెరిపిచ్చినపుడల్లా నగర రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతూ కనిపించాయి. బుధవారం కూడా వర్షం పడే సూచనలు ఉండడంతో అటకెక్కించిన గొడుగులను దులిపే పనిలో అందరూ పడ్డారు.