శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

క్రమంగా పెరుగుతున్న ధాన్యం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, మే 22: మద్దతు ధరకు దిగువున ఉన్న ధాన్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నెల్లూరు మసూరి ధాన్యం ధరలు పదివేల రూపాయల వరకు ఉండగా అవి వారంరోజులుగా పెరుగుదల బాట పట్టాయి. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధరల స్థాయికి చేరుకోగా, నిల్వ ఉంచుకున్న రైతులు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అలాగే దేశంలోనే అత్యంత నాణ్యమైన ధాన్యం సాంబా మసూరి ధరలు సైతం పెరుగుతున్నాయి. అవి పుట్టి (850 కెజీలు) 14వేల రూపాయల వరకు ఉండగా, ప్రస్తుతం మరో 3వేల రూపాయలు పెరిగి 17 వేలకు చేరుకున్నాయి.
రైతులు, వినియోగదారులను దోచుకుంటున్న మిల్లర్లు
రైతు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని మరాడించి వినియోగదారులకు బియ్యాన్ని సరఫరా చేసే కొందరు రైసుమిల్లర్లు రైతులు, బియ్యం వినియోగదారులను ఎడా పెడా దోచుకుంటున్నారు. అత్యంత నాణ్యత కలిగిన సాంబా మసూరి ధాన్యం ప్రస్తుతం పుట్టి 17వేల రూపాయలు పలుకుతున్నాయి. ఇవి ఇటీవల వరకు 14వేల స్థాయిలోనే ఉన్నాయి. అయితే అన్ని ఖర్చులు పోను మరాడించిన బియ్యాన్ని కేజి 33 రూపాయలకు కల్తీ లేకుండా ఇవ్వవచ్చు. కానీ వ్యాపారులు, మిల్లర్లు ఆ తరహా బియ్యానికి కిలో 40 రూపాయలు వసూలు చేస్తూ ఒక్క పుట్టి ధాన్యంపై ఏకంగా 3.5 వేల రూపాయల లాభం పొందుతున్నారు. ఒక ఎకరా పొలం సాగు చేసిన రైతుకు స్వంత దారుడైతే ఆరునెలల కష్టానికి 20 వేల రూపాయలు మిగులు కనిపిస్తుండగా, పది రోజుల పనికి అటు రైతుకు, ఇటు వినియోగదారునికి మధ్య ఉండే వ్యాపారికి 10 వేల రూపాయలు నిఖరంగా లాభం పొందుతున్న పరిస్థితి ఉంది. అదే కౌలు రైతుకు అంతా కలిసి వస్తే ఎకరాకు 5 వేలు, లేకుంటే అసలు కావడం కనాకష్టంగా ఉంది. ఇదే తరహాలో అన్ని రకాల బియ్యంకు సంబంధించి దోపిడీ జరుగుతుండగా, అనుమతులు, ధ్రువీకరణలు లేని బ్రాండ్‌లతో వినియోగదారులను వ్యాపారులు బురిడీ కొట్టిస్తున్నారు. అధికార యంత్రాంగం దీనిపై దృష్టిపెట్టి వినియోగదారులు, రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది.