నెల్లూరు

ధాన్యానికి మద్దతు ధర కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 3: జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వేళ్లపాలెం శ్రీనివాసులరెడ్డి వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఆదివారం చిలకలూరిపేటలో వినతిపత్రం సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని, 4 శాతం వ్యాట్‌ను ఎత్తివేయాలని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి ధాన్యం దిగుబడి తగ్గగా నెల్లూరు జిల్లాలో అధిక దిగుబడి వచ్చిందన్నారు. మార్చి మొదటి వారంలో పుట్టి రూ.17వేలు ఉన్న బిపిటి రకం ధాన్యం నెలాఖరు నాటికి రూ.12వేలకు చేరుకుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పుట్టికి రూ.4వేల వంతున రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి కొనుగోలు కేంద్రాలను పెంచుతామని, తేమ శాతాన్ని 17 నుంచి 25 శాతానికి పెంచి రైతులు అమ్ముకునే ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. త్వరలో జిల్లాలో పర్యటించి సమీక్షిస్తామని ఆయన హామీనిచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బిజెపి నేతలు మద్దు శ్రీనివాసులు, కామిరెడ్డి వెంకురెడ్డి, రాధాకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.