శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, మే 24: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయ. గత వారం తుఫాన్ కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షాకాలాన్ని తలపించిన నేపధ్యంలో గత రెండు రోజుల నుండి సూర్యుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుండటంతో ప్రజలు వేసవి తాపాన్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఈ ఎండలు జూన్ 8వ తేదీ వరకు రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయన్న హెచ్చరికలతో ప్రజలు భీతిల్లుతున్నారు. ఈ ఎండవేడిమికి బైక్‌లలో వెళ్లే వారు సెల్‌ఫోన్ వినియోగించవద్దని నిపుణులు అంటున్నారు. ఎండ వేడిమికి ఫోన్‌లు పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు పడరాని పాట్లు పాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చే ప్రజలకు కనీసం నిలువ నీడనిచ్చే పచ్చని చెట్లు సైతం లేకపోవడంతో ఉదయం 8 గంటల నుండే భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుండటంతో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అల్లాడి పోతున్నారు. ఒక విధంగా ఇళ్లల్లో ఉండేవారికి కూడా విద్యుత్ కోతలు ఈసారి అంతగా లేకపోవడంతో కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. పట్టణంలో గతవారం కురిసిన వర్షాలకు ముందు ఏర్పాటు చేసిన పలు చలివేంద్రాలు అప్పుడే మూతపడటంతో దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు శీతల పానీయాలను సేవించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఇళ్ల వసతి లేని వారు అక్కడడక్కడా ఉన్న చెట్లకింద తమ పిల్లలతో సహా సేదదీరాల్సిన పరిస్థితి నెలకొంది. ద్విచక్రవాహన చోదకులు వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన గొడుగును వాహనానికి అమర్చుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఈ గొడుగు ఎండ వేడిమి నుండి కాస్తంత ఉపశమనం కలిస్తుండగా చిన్నపాటి వర్షానికి ఈ గొడుగు ఎంతో ప్రయోజనకరంగా ఉందని వాహనచోదకులు అంటున్నారు.