శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అత్తపై కోడలి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, మే 26 : తమ పొలం తనకు ఇవ్వాలని కోరిన అత్తపై కోడలు దాడి చేసిన సంఘటన మండలంలోని తాటిపర్తిపాళెం గ్రామంలో గురువారం జరిగింది. బాధితురాలు జయమ్మ ఫిర్యాదు మేరకు వివరాల్లోకి వెళితే తాటిపర్తిపాళెంకు చెందిన మాధవిని ఇందుకూరుపేట మండలం పల్లెపాడుకు చెందిన జయమ్మ కుమారుడు అదినారాయణకు ఇచ్చి వివాహం చేశారు. మాధవి, జయమ్మ తాటిపర్తిపాళెంలో కలిసి పంట పొలం కొన్నారు. కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా మాధవి తాటిపర్తిపాళెంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కాగా జయమ్మ తన పొలాన్ని తనకు ఇవ్వాలని కోరగా కోడలు మాధవి దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.