శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ భూములపై నివేదికలు తయారుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, మే 26 : మండలంలోని రామదాసుకండ్రిగ పంచాయతీ రైతులకు చెందిన ప్రభుత్వ భూములు (బోటు భూములు)పై నివేదిక తయారుచేయాలని నెల్లూరు ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు తహశీల్దార్ సుధాకర్‌తో కలిసి భూములను పరిశీలించారు. 2194, 2195, 2196, 2000, 2201 సర్వే నెంబర్లులోని 94 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది. ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ఈ భూములను ప్రస్తుతం రైతుల వద్ద నుంచి ఎపిఐఐసీకి అప్పగించనున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పక్కాగా పరిశీలించాలని ఆర్డీవో తహశీల్దార్‌ను అదేశించారు. ఈ సర్వే నెంబర్లలో మొత్తం భూమి గ్రామం ఏర్పాటు, రోడ్డు ఏర్పాటుకు పోయిన భూమి, మిగిలిన భూమి తదితర వివరాలతోపాటు అప్పట్లో ఎవరికి పట్టాలిచ్చారు, ప్రస్తుతం సాగులో వారే ఉన్నారా, వారి వారసులున్నారా, వారి వారసులు ఎవరు తదితర అంశాలను క్షణంగా విచారణ జరపాలని తహశీల్దార్‌కు సూచించారు. వారి వద్ద ఉన్న రికార్డులు, పట్టాలను, అధారాలను పరిశీలించాలన్నారు. ఇందుకోసం గ్రామంలో దండోరా వేయించాలని కోరారు. తహశీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ ఈ భూములకు రామదాసుకండ్రిగ, నాయుడుపాళెం వారసులకు పట్టాలిచ్చారని శుక్రవారం రెండు గ్రామాలకు వెళ్లి విచారణ జరుపుతామన్నారు. పట్టాలిచ్చిన వారి వద్ద ఉన్న ఆధారాలు చూపించాలని ఆయన కోరారు.